Home / Technology / మీ ఏరియాలోని మొబైల్ టవర్స్ నుండి ఎంత రేడియేషన్ వస్తుందో ఈ విధంగా తెలుసుకోవచ్చు.

మీ ఏరియాలోని మొబైల్ టవర్స్ నుండి ఎంత రేడియేషన్ వస్తుందో ఈ విధంగా తెలుసుకోవచ్చు.

Author:

మన జీవితాల్లో మొబైల్ ఫోన్లు ఒక భాగమయిపోయాయి, నిత్యావసరాలతో పాటు ప్రతి మనిషికి సెల్ ఫోను కూడా తప్పనిసరి వస్తువుగా మారిపోయింది. రోజు రోజు కి పెరిగిపోతున్న మొబైల్ ఫోన్లకు సిగ్నల్స్ అందివ్వడానికి మొబైల్ నెట్ వర్క్ కంపనీలు కూడా అన్ని ప్రాంతాలను మొబైల్ టవర్స్ తో నింపేసాయి. కాని ఆ మొబైల్ టవర్ల నుండి వెలువడే ఎలక్ట్రో మాగ్నటిక్ రేడియేషన్ (EMF) ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం అని కొన్ని అధ్యయనాలు తెలపడంతో ప్రజల్లో అందోళనను మొదలయ్యాయి. కొన్ని ప్రాంతాల ప్రజలు తమ ఏరియా లో మొబైల్ టవర్స్ పెట్టకుండా అడ్డుకున్న సంధర్బాలు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి అందోళనలు అడ్డుకోవడానికి మరియు ప్రజల్లో మొబైల్ టవర్స్ మీదా ఉన్న సందేహాలను తీర్చడానికి భారత సమాచార మంత్రిత్వ శాఖ తరంగ్ సంచార్ అనే ఒక వెబ్ సైట్ ను ప్రారంభించింది.

mobile tower radiation

తరంగ్ సంచార్ వెబ్ సైట్ లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 14.5 లక్షల మొబైల్ టవర్ల సాంకేతిక వివరాలు పొందుపరిచింది. మీ ఏరియాలో ఎన్ని టవర్లు ఉన్నాయి, అవి ఎంత రేడియేషన్ విడుదల చేస్తున్నాయో? ఆ టవర్ ఏ టెలికాం సర్వీసు ప్రొవైడరు కి సంబందించింది? మరియు 2G, 3G, మరియు 4G టెక్నాలజీలలో దేనికి సంబందించిందన్న సమాచారం ఈ వెబ్ సైట్ ద్వార తెలుసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ లో అన్ని నెట్ వర్క్ వద్ద నుండి సేకరించిన సమాచారాన్ని పొందుపరిచారు మీకు ఈ సమాచారం తప్పని అనుమానం వస్తే రేడియేషన్ ని చెక్ చేయడం కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు కాని దానికి 4000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే తరంగ్ సంచార్ వెబ్ సైట్ ను ఒపెన్ చేసి మీ ఏరియా పరిస్తితి చెక్ చేసుకోండి.

Website : www.tarangsanchar.gov.in

(Visited 604 times, 1 visits today)