Home / Inspiring Stories / కొత్త రియల్ ఎస్టేట్ చట్టంతో బిల్డర్, రియల్ ఎస్టేట్ వ్యాపారుల మోసాలకి చెక్ పెట్టవచ్చు.

కొత్త రియల్ ఎస్టేట్ చట్టంతో బిల్డర్, రియల్ ఎస్టేట్ వ్యాపారుల మోసాలకి చెక్ పెట్టవచ్చు.

Author:

సొంత ఇల్లు అందరి కల, జీవితంలో ఆ కలను సాకారం చేసుకోవడానికి అందరూ చాలా కష్టపడుతారు. అలా కష్టపడి సంపాదించిన డబ్బును రియల్టర్ల చేతిలో పెట్టి చాలమంది మోసపొతున్నారు. ఇల్లు సొంతంగా కట్టించుకోవడానికి సమయం లేకపోవడమో లేక అనుభవం లేకనో చాలా మంది బిల్డర్లను, రియల్టర్లను ఆశ్రయిస్తున్నారు, చేతికి డబ్బు అందే వరకు మంచిగా మాట్లాడే బిల్డర్లు, రియల్టర్లు తర్వాత జనాలకు చుక్కలు చూపిస్తారు. చెప్పిన సమయానికి నిర్మాణం మొదలు పెట్టకపోవడం, మొదలు పెట్టినా చెప్పిన సమయానికి నిర్మాణం పూర్తి చేయకపోవడం, నాణ్యత పాటించకపోవడం ఇలా చాల విషయాల్లో జనాలను మోసం చేస్తున్నారు. అన్ని విషయాలు అగ్రిమెంట్ లో రాయలేకపోవడంతో కస్టమర్లు కూడా ఏమీ చేయలేక ఇబ్బందులు పడటం అలవాటు చేసుకున్నారు. కాని ఇక మీదుట వారి ఆటలు సాగవు. కేంద్ర ప్రభుత్వం కొత్త రియల్ ఏస్టేట్ చట్టం తీసుకురానుంది ఆ చట్టం ప్రకారం ముందుగా డబ్బు కట్టించుకొని, చెప్పిన సమయానికి ఇల్లు ఇవ్వని రియల్టర్లకు ఇక భారి జరిమానాలు విధించనున్నారు. ఆ ప్రతిపాధిత చట్టంలోని ముఖ్య విషయాలు.

real-estate-new-rules-1

  • బిల్డ‌ర్ ముందుగా అగ్రీమెంట్ లో అనుకున్న స‌మ‌యానికి ఇళ్లు క‌స్ట‌మ‌ర్‌కు అప్ప‌గించ‌క‌పోతే అప్పటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ‌రిష్ట వ‌డ్డీ రేటుకు అద‌నంగా 2శాతం క‌లిపి ప‌రిహారంగా క‌స్ట‌మ‌ర్‌కు 45 రోజుల్లోగా చెల్లించాలి.
  • ఇదే రూల్ క‌స్ట‌మ‌ర్ కి కూడా వర్తిస్తుంది. అగ్రీమెంట్ లో అనుకున్న స‌మ‌యానికి రియ‌ల్ ఎస్టేట్ య‌జ‌మానికి క‌స్ట‌మ‌ర్‌ డ‌బ్బులు చెల్లించ‌క‌పోతే అదే వ‌డ్డీని య‌జ‌మానికి తిరిగి చెల్లించాలి
  • నిర్మాణ సంస్థ ముందుగ క‌స్ట‌మ‌ర్‌ నుండి క‌లెక్ట్ చేసిన డ‌బ్బుల్లో, ఖ‌ర్చు చేయ‌ని మొత్తంలో 70 శాతం ఎదైనా బ్యాంకులో డిపాజిట్ చేయాలి. దీని ద్వార క‌స్ట‌మ‌ర్‌ కి డబ్బు బ్యాంకులో ఉన్నదన్న నమ్మకంతో నిర్మాణ సంస్థపై విస్వాసం పెరుగుతుంది.
  • బిల్డ‌ర్ అగ్రీమెంట్ లో అనుకున్న స‌మ‌యంలోగా ప్రాజెక్టు కంప్లీట్ చేయ‌క‌పోతే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన‌ ఒరిజినల్‌ ప్లాన్లు, తర్వాత చేసిన మార్పులు, వసూలు చేసిన డబ్బుల వివరాలు,అయిన ఖ‌ర్చు, మొత్తం వ్య‌యం ప్ర‌జ‌ల‌కు బ‌హిర్గ‌తం చేయాలి. ఈ రూల్స్ ని ఎవరైనా పాటించకుంటే లీగల్ చర్యలు తీసుకోవచ్చు మరియు మీకు కోర్టులో తప్పక న్యాయం జరుగుతుంది.
(Visited 1,383 times, 1 visits today)