Home / Entertainment / కులమతాలకు అతీతంగ ఉండే వారే నా ఫ్యాన్స్.

కులమతాలకు అతీతంగ ఉండే వారే నా ఫ్యాన్స్.

Author:

జనసేన పార్టీ అధ్యక్షుడూ, ప్రముఖ నటుడూ పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో జరుగుతున్న ఫ్యాన్స్ వార్ పై స్పందించారు. ఈ మధ్య పవన్ కళ్యాన్ పుట్టినరోజు సందర్భంగా భీమవరం టౌన్ లో పవన్ కళ్యాన్ అభిమానులు కట్టిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని  వ్యక్తులు ద్వంసం చేసారు. ఐతే ఈ పనికి పాల్పడింది ప్రభాస్ అభిమానులే అన్న అనుమానంతో మొదలైన ఘర్షణలు అక్కడ రెందుసామాజిక వర్గాల మధ్య గొడవలు గా మారి హింసాత్మకమవటం తో పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి  ఏర్పడింది…

ఎన్నో సంవత్సరాలనుంచీ భీమవరం లోని రెండు ప్రధాన సామాజిక వర్గాలైన రాజులూ, కాపుల కు మధ్య ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ఎన్నోసార్లు కాపు, రాజుల మధ్య గొడవలు జరిగినా వాటికి స్థానిక ప్రజా నాయకులనుంచీ, రాష్ట్ర స్థాయి మంత్రుల దాకా మద్దతు ఉండి పోలీసు కేసులు కాకుండా చూసుకుంటారనీ, ఎలక్షన్ల సమయంలో కూడా కులాల మధ్య వివాదాలు చెలరేగుతాయనీ అక్కడి ప్రజలే చెప్తూంటారు. కాగా బాహుబలి సినిమా రిలీజ్ కోసం పెద్ద ఎత్తున జరిగిన బైక్ ర్యాలీలో ఆ సినిమా కథానాయకుడైన ప్రభాస్ “రాజు” వర్గానికి చెందిన యువకులు కాపు వర్గాని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేసారట. అప్పటినుంచీ వివాదం చాపకింద నీరులా నడుస్తూనే ఉంది… ఐతే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా పెట్టిన ఫ్లెక్సీలను కూడా ఎవరో ద్వంసం చేయటం తో వివాదం రోడ్డెక్కి.. రచ్చకు దారితీసింది…

ఐతే నిన్ననే అమెరికా నుండి వచ్చిన పవన్ కళ్యాణ్. ఈ వివాదాలకు తెరదించాల్సింది గా అభిమానులకు పిలుపునిచ్చారు. సమ్యమనంగా ఉండాలనీ, కులాలు, మతాల లాంటి అసమానతలకు నా అభిమానులు దూరంగా ఉండాలనీ ఆయన అన్నారు. ఆతర్వాత ఆయన ఫ్యాన్స్ అసోసిఏషన్ లీడర్ ఉండవల్లి రమేష్ నాయుడూ, కాపు నాడు లీడర్ చిన మిల్లి వెంకట్రాయుడు లతో మాట్లాడారు. కొసమెరుపేంటంటే ప్రభాస్ ఫ్లెక్సీలను తగలబెడ్తున్న పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ అంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఈ వీడియోల వల్ల ఇంకా వివాదాలు పెరిగే అవకాశం ఉంది..

(Visited 31 times, 1 visits today)