Home / General / Video: మెట్రో నుంచి రోడ్ మీద వెళ్తున్న కారులో దిగబడిన రాడ్.

Video: మెట్రో నుంచి రోడ్ మీద వెళ్తున్న కారులో దిగబడిన రాడ్.

Author:

హైదరాబాద్ నగరంలో జరుగుతున్న మెట్రో పనుల్లో షాకింగ్. ఇప్పటి వరకు ఒక్క పొరపాటు, చిన్న ప్రమాదం జరక్కుండానే జరుగుతున్నాయి నిర్మాణ పనులు. అయితే జనవరి 19వ తేదీ శుక్రవారం రోజు ఛాదర్ ఘాట్ మెట్రో నిర్మాణాల దగ్గర జరిగిన సంఘటన షాకింగ్ కు గురి చేసింది. ఎల్బీనగర్ – అమీర్ పేట్ రూట్ లో సెకండ్ ఫేజ్ మెట్రో రూట్ వర్క్ జరుగుతుంది. మెట్రో పనులు జరుగుతుండగా పై నుంచి ఓ ఇనుప రాడ్ కిందకి పడింది. అది సరిగ్గా కారు ఇంజిన్ లోకి నిలువునా దిగబడింది. ఈ ఘటనతో షాక్ అయిన వాహనదారుడు కారును పక్కకి తీసి పోలీసులకు కంప్లయింట్ చేశాడు.

పోలీసుల వివరాల ప్రకారం యాకుత్ పురాకి చెందిన వ్యాపారవేత్త అబ్దుల్ ఐజాజ్ (45) ఇటీవలే టాటా బోల్ట్ వాహనం కొనుగోలు చేశాడు. ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. మలక్ పేట్ నుండి కోఠి వైపు వస్తున్నాడు. ఛాదర్ ఘాట్ దగ్గరకు రాగానే మెట్రో పై నుంచి ఓ రాడ్ కారు బానెట్ పై పడింది. సరిగ్గా ఇంజిన్ లోకి నిలువున దిగబడింది. బానెట్ ను చీల్చుకుని వెళ్లటం ఆశ్చర్యం కలిగించింది. ఏ మాత్రం కొంచెం పక్కన పడినా.. ఓ క్షణం తర్వాత పడినా అది వాహనదారులపై పడేది. తృటిలో పెద్ద ప్రమాదం తప్పిందని ఐజాజ్ చెబుతున్నాడు. దీనిపై పోలీస్ కేసు నమోదు అయ్యింది. IPC సెక్షన్ 336 కింద కేసు నమోదు అయ్యింది. ఎల్ అండ్ టీ నిర్లక్ష్యంపై కూడా విచారణ చేపట్టారు. ఇప్పటివరకు మెట్రో పనులలో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో వాహనదారులంతా మెట్రో పనులు జరుగుతున్న రూట్ లలో తాపీగా వెళ్లేవారు.. ఇప్పుడు కొంచెం భయంభయంగా ఎప్పుడు ఏది పై నుండి కింద పడుతుందో అనే టెన్షన్ తో వెళ్తున్నారు.

(Visited 910 times, 1 visits today)