Home / Latest Alajadi / దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన లగడపాటి సర్వే..! ఎగ్జిట్ పోల్ వివరాలివే.! గెలుపెవరిదంటే.?

దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన లగడపాటి సర్వే..! ఎగ్జిట్ పోల్ వివరాలివే.! గెలుపెవరిదంటే.?

Author:

తెలంగాణలో పోలింగ్‌ ముగిసిన తర్వాత మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ మీడియాతో మాట్లాడనున్నారు. ఎన్నికల సర్వే ఫలితాలను ఆయన వెల్లడించనున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరి ఆసక్తి ఆ సర్వే ఫలితాలపైనే. ఇప్పుడు ఆ సర్వే రానే వచ్చింది. ఎన్నికలకు ముందు 8 నుంచి 10 మంది అభ్యర్థులు గెలుస్తారని, పోలింగ్‌ శాతం తగ్గితే హంగ్‌ వస్తుందని బాంబు పేల్చిన లగడపాటి.. ప్రజలనాడీ హస్తం వైపే ఉందని హింట్‌ ఇచ్చారు.

కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ పార్టీ 35 స్థానాలకే పరిమితమవుతుందని, 10 సీట్లు అటూ ఇటూ కావచ్చని తేల్చేశారు. కాంగ్రెస్, టీడీపీ జట్టుకట్టిన ప్రజాకూటమికి 65 స్థానాలు వస్తాయని వస్తాయని తెలిపారు. ఇండిపెండెంట్లకు 8-10 సీట్లు వస్తాయని, బీజేపీకి గతంలో కంటే ఎక్కువగా అంటే, 7 సీట్లకు అటు ఇటు వస్తాయని, టీడీపీ పోటీ చేసిన 12 స్థానాల్లో 2 చోట్ల ఇండిపెండెంట్లు గెలుస్తారని వెల్లడించారు. మొత్తం మీద ఏడుగురు ఇండిపెండెంట్లు గెలిచే అవకాశం ఉందన్నారు. అసదుద్దీన్ నాయకత్వంలోని మజ్లిస్ పార్టీకి 6 నుంచి 7 సీట్లు రావచ్చన్నారు.

(Visited 1 times, 3 visits today)