Home / General / ఎల్ఐసి పాలసీదారులకి హెచ్చరిక..!

ఎల్ఐసి పాలసీదారులకి హెచ్చరిక..!

Author:

మీరు ఎల్‌ఐసీ పాలసీదారులా? మీ పాలసీని ఆధార్‌తో ఎస్సెమ్మెస్‌ ద్వారా అనుసంధానం చేసుకోవాలని మీ మొబైల్‌కు సందేశమేదైనా వచ్చిందా? అయితే మీరు తప్పక చదవాల్సిన వార్త ఇది. ఇటీవల ఎస్సెమ్మెస్‌ ద్వారా పాలసీని ఆధార్‌తో జత చేసుకోవాలంటూ వస్తున్న సందేశాలపై ప్రముఖ బీమా సంస్థ ఎల్‌ఐసీ స్పందించింది. అలాంటి సందేశాలు నమ్మొద్దు అంటూ ఒక ప్రకటన జారీ చేసింది.

lic-danger

ఇటీవల ఎల్‌ఐసీ లోగోతో కూడిన ఓ సందేశం విస్తృతంగా సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. తమ పాలసీకి ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలనుకునే వారు అందులో ఉన్న నంబర్‌కు ఎస్సెమ్మెస్‌ పంపాలన్నది దాని సారాంశం. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ తమ ఖాతాదారుల సొమ్ముకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఒక ప్రకటనను జారీ చేసింది. సోషల్‌మీడియాలో వస్తున్న అలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని సూచించింది. అలాంటి సందేశమేదీ ఎల్‌ఐసీ జారీ చేయలేదని, ఎస్సెమ్మెస్‌ ద్వారా ఆధార్‌ను అనుసంధానం చేసుకునే సదుపాయమేదీ ప్రస్తుతానికి కల్పించలేదని పేర్కొంది. ఒక వేళ ఆ సదుపాయాన్ని కల్పించినట్లయితే ఆ వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని తెలిపింది. మీ వ్యక్తిగత వివరాలు పంచుకోవాల్సిన వచ్చినప్పుడు ముందుగా స్థానిక ఎల్‌ఐసీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. ఇలా ఆధార్ పేరుతో పాలసిదారులకి మెసేజ్ చేసి వారి పాలసీ నెంబర్ లని, ఇతర వివరాలని సంపాదించి ఆర్థిక నేరాలకు పాల్పడుతుంటడంతో ఎల్ఐసి ఉన్నతాధికారులు ఈ ప్రకటన చేసారు.

పాలసీ నంబర్లను ఆధార్‌తో అనుసంధానం చేయాలని ఇది వరకే ఐఆర్‌డీఏ ఆయా బీమా కంపెనీలకు సూచించింది. మనీలాండరింగ్‌ నిరోధానికి ఆర్థిక సేవలైన పాన్‌ కార్డు, బీమా పాలసీలకూ ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి చేస్తూ కేంద్రం కూడా జూన్‌లో ఆదేశాలిచ్చింది. అయితే, ఎల్‌ఐసీ చెప్పినట్లుగా ఎస్సెమ్మెస్‌ రూపంలో అనుసంధానం చేసుకునే అవకాశమేదీ లేదు కాబట్టి పాలసీదారులూ బహుపరాక్‌!
ఎల్ఐసి పాలసీ గురుంచి ఏమైనా మెసేజ్ లు, కాల్స్ వస్తే వాటికి స్పందించకండి.

(Visited 585 times, 1 visits today)