Home / Inspiring Stories / 6 వేలకోట్ల ఆస్తిని వదిలేసి కొడుకుని బేకరీలో పనిచేయమన్న తండ్రి..! అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

6 వేలకోట్ల ఆస్తిని వదిలేసి కొడుకుని బేకరీలో పనిచేయమన్న తండ్రి..! అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Author:

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సెన్సేషనల్ సినిమా ‘అరుణాచలం’ ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసే ఉంటారు, ఆ సినిమాలో రజినీకాంత్ వాళ్ళ తండ్రికి వేల కోట్ల ఆస్తి ఉంటుంది, తన కొడుక్కి డబ్బు మీద వ్యామోహం ఉండకూడదు అని 30 రోజులలో 300 కోట్లని ఖర్చు పెట్టమని చెప్తాడు, అలా చేయడం మన హీరో గారికి డబ్బు మీద వ్యామోహం పోయి తన ఆస్తినంతా పేదల కోసం ఖర్చు పెడతాడు, ఇంకా లేటెస్ట్ గా వచ్చిన బిచ్చగాడు సినిమాలో కూడా హీరో చాలా పెద్ద పెద్ద కంపెనీలు, వేల కోట్ల ఆస్తులు ఉంటాయి కానీ హీరో మాత్రం తన తల్లి కోసం తన ఆస్తినంతా వదిలేసి బిచ్చం ఎత్తుకొని బతుకుతాడు, ఇప్పుడు ఈ సినిమాలలో జరిగినట్టుగానే బయట కూడా జరిగింది…!

ఈ తండ్రి కూడా తన కొడుక్కి డబ్బు విలువ, పేదల కష్టాలు తెలియాలనుకున్నాడు. కాకపోతే మార్గం మాత్రం అరుణాచలం సినిమాకు రివర్సులో ఎంచుకున్నాడు. వేల కోట్లకు వారసుడయిన తన కొడుకుని ఇంట్లోంచి పంపేసి 30 రోజుల పాటూ బతికి చూపించమని ఛాలెంజ్ చేశాడు. మరి ఆ కొడుకు సాధించాడా?

Dhravya

గుజరాత్‌ లోని సూరత్‌కి చెందిన సావ్‌జీ పెద్ద వజ్రాల వ్యాపారి. హరే కృష్ణ డైమండ్ ఎక్స్‌ పోర్ట్స్ యజమాని. ఆయన కంపెనీ 71 దేశాల్లో వ్యాపారం చేస్తుంది. దాదాపు 6 వేల కోట్ల రూపాయల ఆస్తులున్న కంపెనీ అది. సంవత్సరానికి దాదాపు వెయ్యి కోట్లకి పైనే వ్యాపారం చేస్తుంది, సావ్‌జీ కొడుకు ధ్రువ చాలా మంచి యూనివర్సిటీలలో చదివాడు, ఇప్పుడు అమెరికాలో ఎంబీఏ చదువుతున్నాడు.

కొన్ని రోజుల క్రితం ఇండియా కి వచ్చిన తన కొడుకు ధ్రువకి సావ్ జీ 3 జతల బట్టలు, 7 వేలు ఇచ్చి, తనెవరో తెలియని కేరళలోని కొచ్చి నగరానికి పంపాడు, అక్కడే నెల రోజులు ఉండాలని, నీకు అయ్యే ఖర్చులని సొంతంగా సంపాదించుకోవాలని,లా ఎమర్జెన్సీ అయితే తప్ప ఇచ్చిన 7 వేలని ఉపయోగించవద్దు అని చెప్పాడు, తండ్రి పేరు చెప్పకుండా సొంతంగా ఉద్యోగాన్ని సంపాదించుకోవాలని, ఎక్కడా వారం కంటే ఎక్కువగా పనిచేయకూడదు అని, మొబైల్ ఫోన్ కూడా వాడొద్దని షరతులు చెప్పాడు, వీటన్నింటికి కొడుకు ఒప్పుకున్నాడు.

తండ్రి మాట ప్రకారం జూన్ 21 న కొచ్చికి వచ్చిన ద్రువకి మొదటి వారం రోజులలో ఎక్కడ ఒక్క ఉద్యోగం కూడా దొరకలేదు, 60 చోట్లా ఉద్యోగానికి వెళితే ఒక్కరు కూడా పని ఇవ్వలేదు,చివరకి ఒక బేకరీలో ఉద్యోగం దొరికింది, అక్కడ వారం రోజులు చేసిన తరువాత కాల్ సెంటర్ లో పనిచేశాడు, తరువాత ఓ చెప్పుల షాపులో పనిచేశాడు. మెక్ డొనాల్డ్ ఔట్లెట్‌లో కూడా పని చేశాడు, నెల రోజులు కష్టపడి 4 వేలు సంపాదించాడు, “నేనెప్పుడూ డబ్బుల గురించి ఆలోచించలేదు కానీ, భోజనానికి, ఉండటానికి సరిపడా సంపాయించాలని కష్టపడ్డాను. 40 రూపాయలకు భోజనం చేసేవాణ్ణి. రోజుకు 250 రూపాయలు లాడ్జి ఖర్చు అయింది నాకు.” అన్నాడు ద్రవ్య.

తండ్రి 6 వేల కోట్లకు అధిపతి..కొడుకు మాత్రం బేకరీలో ఉద్యోగి

నెల ముందు కేవలం 3 జతల బట్టలు, 7 వేళా రూపాయలతో వెళ్లిన ధ్రువ తిరిగివచ్చేటప్పుడు మాత్రం జీవితానికి కావాల్సిన పాఠాలని నేర్చుకొని తిరిగివచ్చాడు అని పేదల కష్టాలను, పేదల శ్రమకి ఉండే విలువల గురుంచి నేర్చుకొని జులై 20 న తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు.“జీవితాన్ని అర్థం చేసుకోవాలనీ, పేదలు డబ్బు కోసం, ఉద్యోగాల కోసం ఎలా కష్టపడతారో మా అబ్బాయి తెలుసుకోవాలని కోరుకున్నాను. ఏ యూనివర్సిటీలో ఇలాంటివి చెప్పరు. అందుకే మావాడికి ఈ పరీక్ష పెట్టాను” అన్నారు ఆ తండ్రి.

ఎంత డబ్బున్న కుటుంబంలో పుట్టినా, వారసత్వంగా ఎంత ఆస్తి వచ్చినా మనుషుల విలువ, డబ్బు విలువ, శ్రమ విలువ తెలియకపోతే, జీవితంలో విలువలు లేకపోతే ఏవి ఉన్నా లేనట్టే.. అదే సూత్రం అద్భుతంగా, ప్రాక్టికల్‌గా చెప్పిన ఆ తండ్రికీ, తండ్రి మాటను జవదాటకుండా, జీవితంలో ఎన్నో నేర్చుకున్న ఆ కొడుక్కీ.. ఇద్దరికీ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

అరుణాచలం సినిమాలో రజినీ డైలాగ్ ఒకటుంది. తను పందెం గెలిచి 3 వేల కోట్ల ఆస్తి పత్రాలు తన చేతుల్లోకి వచ్చినా, వాటిని వాడకుండా, తిరిగి సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టేయమంటాడు. అప్పుడు చెబుతాడు ఓ డైలాగ్! “అయ్యా, ఏ తల్లితండ్రులైనా పిల్లలకు ఇవ్వగలిగేది శరీరం మాత్రమే. ఎవడైతే ఆ శరీరంతో కష్టపడి సంపాదించి, తాను సంపాదించిన సొమ్ముతో ఆ తల్లితండ్రులను సుఖంగా చూసుకుంటాడో, ఆడేనయ్యా నిజమైన మగాడు. నేను మగాడ్ని.” అంటాడు రజినీకాంత్.

మా నాన్న ఏం సంపాదించలేదు. మా తాత ఉన్నదంతా తగలేశాడు. మా మామ నాకేమీ పెట్టలేదు. మా ఆవిడ ఏమీ తేలేదు. మా ఆయనకి ఆస్తీ పాస్తీ ఏమీ లేదు..” అనుకునేవాళ్లకు, రజినీకాంత్ చెప్పిన ఆ డైలాగ్ అద్భుతమైన సమాధానం!

Source: Korada

Must Read: తెలంగాణా & ఆంధ్రప్రదేశ్ లో మీయొక్క భూమి వివరాలు సర్వే నెంబర్ తో సహా తెలుసుకోవాలని ఉందా ?

(Visited 13,951 times, 1 visits today)