Home / General / ఒక్క ఫోన్ కాల్ తో మొబైల్ నంబర్ – ఆధార్ లింక్ చేసేయొచ్చు..!

ఒక్క ఫోన్ కాల్ తో మొబైల్ నంబర్ – ఆధార్ లింక్ చేసేయొచ్చు..!

Author:

మొబైల్ నెంబర్ లకి ఆధార్ లింక్ చేయాలనీ టెలికాం నెట్ వర్క్ కంపెనీలు తమ వినియోగదారులకు ఫోన్ లు, మెసేజ్ లు చేస్తున్నారు, మొబైల్ నెంబర్ కి ఆధార్ లింక్ చేయకపోతే మీ నెంబర్ నిలిచిపోతుందని భయపెడుతున్నారు కూడా..! ఇప్పటివరకు వినియోగదారులు నెట్ వర్క్ కంపెనీల షాప్ ల వద్ద, డీలర్ల వద్ద తమ ఫోన్ నెంబర్ కి ఆధార్ లింక్ చేసుకునే వారు..! ఈ ప్రాసెస్ ఉచితమే అయిన కొంతమంది డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు..! ఇక ఇంటి దగ్గర నుంచే మొబైల్.. ఆధార్ లింక్ చేసుకొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. OTP సర్వీస్ తో ఆధార్ ని మొబైల్ నెంబర్ కి అనుసంధానం చేసే విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ విధానం 2018 జనవరి 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఆధార్ తో మొబైల్ అనుసంధానానికి చివరి గడువు ఫిబ్రవరి 6వ తేదీ.

ఆధార్ లింక్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 కోట్లపైనే మొబైల్ నెంబర్లు ఆధార్ తో లింక్ కావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆయా టిలికాం కంపెనీలకు వెళ్లి ఆధార్ లింక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది మరింత ఆలస్యం అవుతుండటంతో.. టెలికాం కంపెనీలు IVRS (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా మొబైల్ – ఆధార్ లింక్ కి సన్నాహాలు చేస్తున్నాయి. మీరు ఇంట్లో ఏ మొబైల్ నెంబర్ తో అయితే ఆధార్ లింక్ కావాల్సి ఉందో.. ఆ నెంబర్ నుంచి కాల్ చేస్తారు. ఆధార్ నెంబర్ యాడ్ చేస్తారు. వెంటనే కన్ఫర్మేషన్ కోసం OTP నెంబర్ మొబైల్ కు వస్తుంది. OTP నెంబర్ యాడ్ చేయగానే మొబైల్ కి ఆధార్ లింక్ అయిపోతుంది. ప్రస్తుతం గ్యాస్, ఇతర సర్వీసులకు IVRS సిస్టమ్ ఎలా అయితే వర్క్ చేస్తుందో.. అదే తరహాలో ఉంటుంది. దేశంలోని అన్ని భాషల్లో జనవరి ఒకటి నుంచి ఈ విధానం అమల్లోకి రాబోతుంది.

(Visited 574 times, 1 visits today)