Home / Inspiring Stories / జులై లోగా మీ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోవాలి..! లేదంటే పాన్ కార్డు రద్దు అవుతుంది.

జులై లోగా మీ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోవాలి..! లేదంటే పాన్ కార్డు రద్దు అవుతుంది.

Author:

ఆధార్ కార్డును అన్నింటితో జతపరుచుతున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా పాన్ కార్డును కూడా తప్పనిసరిగా ఆధార్ తో లింక్ చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంవత్సరం జులై ఒకటి లోగా మీ పాన్ కార్డ్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోకపోతే ఉద్యోగస్తులు, ట్యాక్స్ చెల్లింపులు చేసే వారు ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయలేరని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. పాన్ కార్డుల జారీలో జాగ్రత్తలు పాటించకపోవదంతో కొంత మంది ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు పొంది టాక్స్ కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. ఈ పాన్ కార్డుల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకే జులై ఒకటి లోగా అందరు తమ పాన్ కార్డు తమ ఆధార్ తో లింక్ చేసుకోవాలని చెప్పారు నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్(NSDL) ఉపాధ్యక్షులు రాధాకృష్ణన్. ఐతే సాధరణ ప్రజలకు పాన్- ఆధార్ లింక్ గడువు ఈ సంవత్సరం డిసెంబర్ 31 దాక ఉంది. మీ పాన్ కార్డును ఆధార్ తో ఏలా లింక్ చెసుకోవాలో క్రింది వీడియో లో చూడండి.

ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారి వెబ్ సైట్ https://incometaxindiaefiling.gov.in/ ఓపెన్ చేసాక ఇంతకు ముందు మీరు ఎకౌంట్ క్రియేట్ చేయనట్లైతే ఒక కొత్త ఎకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేసిన ఎకౌంట్ తో లాగిన్ అయ్యి మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి మీ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోవచ్చు. ప్రతి పాన్ కార్డు ను ఇలా ఆధార్ తో లింక్ చేయాల్సిందే లేకపొతే తరువాత మీ పాన్ కార్డు పని చేయదు దానితో మీ బ్యాంకు ఖాతా కూడా స్తంభించే అవకాశం ఉంది.

(Visited 2,072 times, 1 visits today)