Home / General / 2018 లో ప్రభుత్వ సెలవుల లిస్ట్..!

2018 లో ప్రభుత్వ సెలవుల లిస్ట్..!

Author:

రాబోయే నూతన సంవత్సరం 2018 కి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ గారు శుక్రవారం రోజు ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులని జారీ చేసారు, 2018 లో 28 సాధారణ సెలవులు, 22 ఐచ్ఛిక సెలవులు కలిపి మొత్తం 50 రోజులని ప్రభుత్వం సెలవులుగా ప్రకటించింది.

ప్రభుత్వం ప్రకటించిన సెలవుల్లో 7 ఆదివారాలు, రెండు రెండవ శనివారాలు ఉన్నాయి, భోగి, ఉగాది పండుగలు ఆదివారం రోజు వచ్చాయి, 2017 లో ప్రభుత్వ సెలవులు ఎక్కువగా వీకెండ్ లో వచ్చాయి కానీ 2018 లో ప్రభుత్వ సెలవులు ఎక్కువగా వీక్ డేస్ లో రావడం గమనార్హం..నూతన సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటిని ప్రభుత్వం సెలవు రోజుగా ప్రకటించింది.

2018లో ప్రభుత్వ సెలవులు 2018-Holidays-List

ఐచ్ఛిక సెలవులు:

  • జనవరి 16న కనుమ,
  • 22న శ్రీపంచమి,
  • ఫిబ్రవరి 1న హజ్రత్ సయ్యద్ మహ్మద్ జన్మదినం,
  • మార్చి 29న మహావీర్ జయంతి,
  • ఏప్రిల్1న హజ్రత్ అలీ జన్మదినం,
  • 15న షబ్‌ఏ మెరాజ్,
  • 18న బసవ జయంతి,
  • 29న బుద్ధ పూర్ణిమ,
  • మే2న షబ్ ఈ బరాత్,
  • జూన్5న షాదత్ అలీ,
  • 12న షాబ్ ఏ ఖదీర్,
  • 15న జుమా అతుల్ వాదా,
  • జూలై14న రథయాత్ర,
  • ఆగష్టు 17న పార్శీల నూతన సంవత్సరం,
  • 24న వరలక్ష్మీ వ్రతం,
  • 26న రాఖీపౌర్ణమి,
  • 30న ఈద్‌ఏ గదీ,
  • సెప్టెంబర్ 20న మొహర్రం,
  • అక్టోబర్ 30న అరెబయీన్,
  • నవంబర్6న నరక చతుర్దశి,
  • డిసెంబర్19న యాజ్ దహుమ్ షరీఫ్,
  • 24న క్రిస్మస్ ఈవ్.
(Visited 2,176 times, 1 visits today)