Home / Uncategorized / లిటిల్ సోల్జర్స్ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.? ఆమె బాక్గ్రౌండ్ ఇదే.!

లిటిల్ సోల్జర్స్ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.? ఆమె బాక్గ్రౌండ్ ఇదే.!

Author:

లిటిల్ సోల్జర్స్ సినిమా రిలీజ్ అయ్యి చాలా సంవత్సరాలు అయ్యింది… కానీ ఇప్పటికి ఈ సినిమా లో నటించిన చిన్న పిల్లలని ఎవ్వరు మర్చి పోలేకున్నారు .
లిటిల్ సోల్జర్స్ లో అద్భుతంగా నటించిన బేబీ కావ్య ఎవరి కూతురో తెలిస్తే ఆశ్చర్యపోతారు . హైదరాబాద్ సన్ షైన్ హాస్పిటల్ ఫౌండర్ ఐన గురువా రెడ్డి గారి గారాలపట్టి కావ్య . కావ్య తల్లి గారు ఫేమస్ గైనకాలజిస్ట్.

ప్రస్తుతం కావ్య , సన్షైన్ హాస్పిటల్ లోనే డాక్టర్ గా సేవలందిస్తుంది . కావ్య సోదరుడు ఆదర్శ్ కూడా డాక్టర్ గా సన్షైన్ హాస్పిటల్ లోనే సేవలందిస్తున్నారు , కావ్య సోదరుడు ఆదర్శ్ లిటిల్ సోల్జర్స్ సినిమా లో నటించాడు .

ఆదర్శ్ ఫ్రెండ్ ఖుషాల్ ని కావ్య లవ్ చేసి పెళ్లిచేసుకుంది. నాలుగేళ్లపాటు సాగిన ప్రేమాయణంలో ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్నారు. కేరళలో సన్నిహితుల నడుమ వైభవంగా పెళ్లి జరిగింది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కుటుంబ సమేతంగా వీరి పెళ్ళికి విచ్చేసారు. ఖుషాల్ మణిపాల్ లో మెడిసిన్ చేసి ,హైదరాబాద్ లోనే సన్ షైన్ హాస్పిటల్ లో పనిచేస్తున్నాడు.



చైల్డ్ ఆర్టిస్ట్స్ గా నటించిన వాళ్ళు ఇప్పుడు హీరో , హీరోయిన్స్ గా రంగం లోకి దూకి తమ లక్ ని పరీక్షించుకుంటున్నారు. కొంత మంది సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గ నటిస్తుంటే , మరి కొందరు సీరియల్స్ కి పరిమితమయ్యారు . కేవలం కొంత మంది మాత్రమే చైల్డ్ ఆర్టిస్ట్స్ గా నటించిన , వేరే రంగాలను ఎంచుకొని జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు . వారిలో కావ్య మరియు కావ్య సోదరుడు అయిన ఆదిత్య ఒకరు.

(Visited 1 times, 1 visits today)