Home / Inspiring Stories / మ‌ర‌ణానికి చేరువైన భార్య ఆఖరి కోరిక తీర్చ‌డం కోసం…ఓ భ‌ర్త ప‌డ్డ క‌ష్టమిది.

మ‌ర‌ణానికి చేరువైన భార్య ఆఖరి కోరిక తీర్చ‌డం కోసం…ఓ భ‌ర్త ప‌డ్డ క‌ష్టమిది.

Author:

జీవితం అramesh-achu-1నేక పరీక్షల సమాహారం అంటారు గొప్ప గొప్ప ఫిలాసఫర్ లు. మనం అనుకున్నది అనుకున్నట్టు కాదు కదా కాస్తంత కూడా దగ్గరగా జరగని రోజులు బోలెడు ఉంటాయి. అలాంటి పరీక్షలు అన్నీ ఎదిరిస్తే , ఎదిరించి నిలబడితే నే దేవుడికంటే కూడా గొప్పవాడు అవుతాడు మనిషి. ప్రాణానికి ప్రాణంగా మనం చూసుకునే మన తల్లి , బిడ్డలు , భార్య , భర్త , అన్న చెల్లి , తమ్ముడు , అక్క ల మరణమే మనిషి జీవితం లో అన్నిటికంటే చాలా పెద్ద బాధ. నిజానికి అందరం చనిపోవాల్సిన వాళ్ళమే కానీ చావు అనేది ముందుగా వచ్చేస్తోంది అనే బాధ అన్నిటికంటే దారుణమైనది. యా విషయం ముందు తెలిస్తే ఇక ఆ నరకం అంతా ఇంతా కాదు. అలాంటి కష్టమే రమేష్ కుటుంబం లోకి వచ్చింది.

భయంకర క్యాన్సర్ తో భాదపడుతూ ఉన్న తన భార్యను రక్షించడానికి చేయాల్సిందంతా చేస్తున్నాడు ఆ భర్త.డాక్టర్స్ కూడా ఆమె ను కాపాడటానికి శతవిదలా ప్రయత్నం చేస్తున్నారు.కోచిలోని ఓ హాస్పటల్ లో రెండోసారి కెమోథెరఫి అబ్సర్వేషన్ లో పెట్టారు.ఆమెకు సచిన్ టెండూల్కర్ అంటే చాలా ఇష్టం, మరో నాలుగు రోజుల్లో కోచిలో ఇండియన్ పుట్ బాల్ మ్యాచ్ జరగనుంది.పుట్ బాల్ మ్యాచ్ ఆటగాళ్ళలో ఆత్మ విశ్వాసం నింపడానికి సచిన్ అక్కడకు వస్తున్నాడు అనే విషయం ఆమెకు తెలిసింది.తన అభిమాన క్రికెటర్ సచిన్ కోచి వస్తున్నాడన్న సంగతి ఆమెకు ఆనందాన్ని కలిగించింది.ఎలాగైనా సచిన్ ను చూడాలని ఆ ఫుట్ బాల్ మ్యాచ్ కి తీసుకేల్లమని తన భర్తను అడిగింది.

ramesh-achu1

అయన ఇలాంటి పరిస్థిలో ఎందుకు మరోసారి తిసుకేల్తలే అని చెప్పాడు.తన భార్య కి సచిన్ అంటే పిచ్చి అని అతనికి బాగా తెలుసు. ఎలాగైనా భార్యకి సచిన్ ని చూపించాలి అనుకున్నాడు రమేష్. కీమో జరుగుతూ ఉన్న టైం లో బయటకి వెళ్ళద్దు అని డాక్టర్ లు సైతం ఒద్దు అన్నారు. కానీ ఆమె చనిపోతే ఆమెకి సచిన్ ని చూసే అవకాశం కోల్పోతుంది కదా అనుకున్నాడు,దానికోసం తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఎలాగైనా టికెట్స్ కావాలని చెప్పాడు.ఎంత కష్టమైన q లో ఎంత సేపు నిలబడైన టికెట్స్ సంపాదించాలని సూచించాడు.పరిస్థితి దిగజారితే తనను వెంటనే చికిత్సకి తరలించాలి స్టేడియం దగ్గరో ఉన్న హాస్పటల్ కి అంబులెన్స్ లకు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వాళ్ళు కావాల్సిన  జాగ్రతలు తీసుకున్నారు.

ఆమెను తీసుకొని మ్యాచ్ కి వెళ్ళాడు.వేలాది మంది ప్రేక్షకుల కేరింతా’లు చూసి తెగ ఆనంద పడింది.సచిన్ సచిన్ అనే అరుపులు విని ఆమె భాదనంత మరిచిపోయింది.ఆ సమయంలో ఆయన భార్య ఆయనకి ఎంతో అందంగా కనిపించిందట. రమేష్ తన భార్య కోరిక తీర్చి ప్రపంచాన్ని జైయించినంత ఆనందాన్ని పొందాడు.కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు.కొద్ది రోజులకే రమేష్ భార్య చనిపోయింది.ఆమె చనిపోయిన తన జ్జాపకాలు వెంటాడుతున్నాయి.గత ఏడాది తన భార్య చివరి కోరిక తీర్చిన తీరును ఆ సందర్భంలో కలిగిన ఆనందం,అనుభూతిని తన పేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు.

తన ఫ్యామిలీతో స్టేడియం లో దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేసాడు.నా భార్య చాల దైర్యవంతురాలు కొద్ది రోజుల్లో చనిపోతుందని తెలిసిన దైర్యంగా ఉండేది.జీవితం ఎంతో అందమైనది ప్రతి క్షణం ఆస్వాదించండి.గాడ్ బ్లెస్ యు అంటూ రాసాడు.వారికీ అపురూపంగా పుట్టిన కొడుకును అపురూపంగా చూసుకుంటూ రోజులు గడుపుతున్నానని చెప్పుకోచ్చాడు.జూలై 19 న రమేష్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.భార్య పట్ల రమేష్ చూపించిన ప్రేమకు నెటిజన్లు హాట్సాఫ్ చెబుతున్నారు.భారమైన గుండె తో రమేష్ కి అభినందనలు చెబుతున్నారు.భార్య బ్రతికుండగానే నరకం చూపిస్తున్న ఈ రోజుల్లో రమేష్ లాంటి వాళ్ళు అరుదే కదా.అలాంటి భర్త ప్రేమకు దూరమైనదురదుస్టవంతురాలు పేరు అజు.భార్యను ప్రేమించే ప్రతి ఒక్కరు షేర్ చేయండి.

Credits : Facebook

(Visited 11,764 times, 1 visits today)