Home / General / వంట గ్యాస్ సబ్సిడీ డబ్బులు మీ బ్యాంకు అకౌంట్ లో పడట్లేదా..? ఏ కంపెనీ గ్యాస్ అయినా ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి..!

వంట గ్యాస్ సబ్సిడీ డబ్బులు మీ బ్యాంకు అకౌంట్ లో పడట్లేదా..? ఏ కంపెనీ గ్యాస్ అయినా ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి..!

Author:

వంట గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం, అది డెలివరీ అవ్వడం చాలా సులభంగానే జరుగుతుంది కానీ ఆ గ్యాస్ సిలిండర్ కి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ డబ్బులు మాత్రం అంత త్వరగా మన అకౌంట్ లో జమ కావు, ఇంతకుముందు సబ్సిడీ అమౌంట్ ని ప్రభుత్వం ముందుగా గ్యాస్ ఏజెన్సీలకి చెల్లించేది, కానీ ఇప్పుడు మనమే ముందుగా గ్యాస్ సిలిండర్ కోసం పూర్తి అమౌంట్ చెల్లించి ప్రభుత్వం నుండి సబ్సిడీ అమౌంట్ బ్యాంకు అకౌంట్ లో వేసిందా..లేదా.. అని ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని సార్లు సిలిండర్ డెలివరీ అయిన పది రోజులకి కూడా సబ్సిడీ అమౌంట్ మన బ్యాంకు అకౌంట్ లో జమ కాదు. మరో వైపు గ్యాస్‌ డీలర్‌ను సంప్రదిస్తే సబ్సిడీ బదిలీ చేశాం అంటారు. కానీ సొమ్ము మాత్రం మన బ్యాంకు అకౌంట్ లో జమ కాదు. ప్రస్తుతం ఈ సమస్యని చాలా మంది ఎదుర్కొంటున్నారు. అసలు ఈ సమస్యకి కారణం ఏంటో.. పరిష్కారం ఏంటో.. ఇప్పుడు తెలుసుసుకోండి.

వంట గ్యాస్ సబ్సిడీ

వంట గ్యాస్‌ సిలిండర్ సబ్సిడీ అమౌంట్ మీ బ్యాంక్‌ అకౌంట్ లో పడలేందంటే అందుకు ముఖ్యంగా రెండు కారణాలు ఉంటాయి. అవేమిటంటే… మీరు కొత్తగా బ్యాంక్‌ ఖాతాను తెరిచి ఉండడం, లేదంటే కొత్తగా ఏదైనా బ్యాంకు నుండి లోన్‌ను తీసుకుని ఉండడం.. ఈ రెండు సందర్భాల్లో మీ ఆధార్‌ కార్డు నంబర్ వేరే బ్యాంక్‌ అకౌంట్లతో అప్ డేట్‌ అవుతుంది. దీంతో చివరి సారిగా ఆధార్‌ అప్ డేట్‌ అయిన బ్యాంక్‌ నంబర్‌కు గ్యాస్‌ సబ్సిడీని ట్రాన్స్‌ఫర్‌ చేస్తారు. అయితే ఇలాంటి సందర్భాల్లో ఏ బ్యాంక్‌కు గ్యాస్‌ సబ్సిడీ ట్రాన్స్‌ఫర్‌ అయిందో తెలుసుకోవాలంటే.. అందుకు కింద చెప్పిన విధంగా చేయాల్సి ఉంటుంది.

Gas-Subcidy-Amount-Status

99*99# డయల్‌ చేయాలి:

మీ మొబైల్‌లో *99*99# డయల్‌ చేయాలి. అప్పుడు రెండు ఆప్షన్లు వస్తాయి. అందులో మొదటి ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 1 నంబర్‌ను ఎంటర్‌ చేసి ఆధార్‌ లింకింగ్‌ స్టేటస్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకున్నాక తరువాత వచ్చే స్క్రీన్‌లో మీ ఆధార్‌ నంబర్‌ను అడుగుతుంది. అందులో ఆధార్ నంబర్‌ను ఎంటర్‌ చేసి కన్‌ఫాం చేసేందుకు 1 ప్రెస్‌ చేయాలి. దీంతో మీ ఆధార్‌ నంబర్‌ను చూపిస్తూ అది ఏ బ్యాంక్‌కు సీడ్‌ అయి ఉందో, ఎప్పుడు సీడ్‌ చేశారో వివరాలను తెలియజేస్తుంది. దీంతో సదరు బ్యాంక్‌ అకౌంట్‌లో గ్యాస్‌ సబ్సిడీ జమ అవుతుండడాన్ని గమనించవచ్చు. ఇలా గ్యాస్‌ సబ్సిడీ ఏ బ్యాంక్‌ అకౌంట్‌లో పడుతుందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఇక కొత్త బ్యాంక్‌ అకౌంట్‌ వద్దు, పాత అకౌంట్‌లోనే గ్యాస్‌ సబ్సిడీ డబ్బు పడాలంటే అందుకు ఇలా చేయాలి..

పాత బ్యాంక్‌ అకౌంట్‌ బ్రాంచ్‌కు వెళ్లాలి. అక్కడ మీ ఆధార్‌ కార్డు జిరాక్స్‌ ఇచ్చి అకౌంట్‌లో సీడ్‌ చేయమని చెప్పాలి. ఆల్రెడీ సీడ్‌ చేశాం అని చెబితే ఎన్‌పీసీఐ సర్వర్‌కు అనుసంధానం చేయమని చెప్పాలి. గ్యాస్‌ సబ్సిడీ కోసం అని చెబితే వారు ఆ పనిచేస్తారు. దీంతో కొత్త బ్యాంక్‌ అకౌంట్‌ కాకుండా పాత బ్యాంక్‌ అకౌంట్‌లోనే గ్యాస్‌ సబ్సిడీ సొమ్ము పడుతుంది. అయితే గ్యాస్‌ సబ్సిడీ సొమ్ము గురించే కాకుండా పలు ఇతర సందేహాలు, సమస్యలకు గ్యాస్‌ వినియోగదారులు ఓ టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయవచ్చు. అదేమిటంటే…

వంట గ్యాస్ సబ్సిడీ

టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేసి:

1800 2333 555 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేసి ఏ కంపెనీకి చెందిన గ్యాస్‌ వినియోగదారుడు అయినా సమస్య సమస్యలను కాల్‌ సెంటర్‌ ప్రతినిధులకు చెప్పవచ్చు. అయితే ఇందులో తెలుగు భాష కూడా చేర్చారు. కనుక ఇప్పుడు తెలుగు గ్యాస్‌ కస్టమర్లు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ నంబర్‌కు కాల్‌ చేసి తమ సమస్యలను తెలవపచ్చు. ఇక ముందు చెప్పిన టోల్‌ ఫ్రీ నంబర్‌ను డయల్‌ చేశాక మొదట 3 నంబర్‌ను ఎంచుకుంటే తెలుగు భాష ప్రతినిధులకు కనెక్ట్‌ అవుతారు. అనంతరం ఇండేన్‌ గ్యాస్‌ కస్టమర్లు 1 ఆప్షన్, హెచ్‌పీ గ్యాస్‌ అయితే 2 నంబర్‌, భారత్‌ గ్యాస్‌ అయితే 3 నంబర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గ్యాస్‌ సబ్సిడీ సమస్య అఇతే 1, ఇతర సమస్యలైతే 2 ప్రెస్‌ చేయాలి. అనంతరం వేచి ఉంటే కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులు లైన్లోకి వచ్చి మీ సమస్యను వింటారు. దీంతో వారు మీ సమస్యకు అనుగుణంగా ఫిర్యాదును జనరేట్‌ చేసి దానికి సంబంధించిన నంబర్‌ను మీకు చెబుతారు. దీంతో వారు తెలిపిన సమయం లోగా మీ సమస్య సాల్వ్ అవుతుంది. ఇక మీ ఫిర్యాదుకు సంబంధించిన సమాచారం మీకు ఎస్‌ఎంఎస్‌ రూపంలో వస్తుంది.

గ్యాస్‌ సబ్సిడీకి చెందిన సమస్యలకు, గ్యాస్‌ బరువులో తేడా ఉన్నా, సీల్‌ లేకుండా సిలిండర్‌ డెలివరీ ఇచ్చినా, బుక్‌ చేసిన నిర్ణీత సమయంలోగా డెలివరీ చేయకపోయినా, గ్యాస్‌ డీలర్‌ మోసం చేసినా, వీటితోపాటు మరేఇతర గ్యాస్‌ సంబంధిత సమాచారంపైనైనా మీరు పైన చెప్పిన టోల్‌ ఫ్రీ నంబర్‌ కు కాల్ చేసి సమస్యలను తెలపవచ్చు. దీంతో టోల్‌ ఫ్రీ నంబర్‌కు పనిచేసే కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులు మీ సమస్య విని దాన్ని సాల్వ్‌ చేసేందుకు యత్నిస్తారు. అయితే ఇక చివరిగా మరో విషయం ఏమిటంటే.. ఒక్కోసారి గ్యాస్‌ సబ్సిడీ ట్రాన్స్‌ఫర్‌ ఫెయిలవుతుంది. ఇలా గనక జరిగిందని భావిస్తే వెంటనే మీ బ్యాంక్‌ బ్రాంచిని సంప్రదించి సమస్యను వివరించాలి. దీంతో వారు ఆధార్‌ అప్‌డేట్‌ చేస్తారు. తద్వారా సమస్య పరిష్కారమవుతుంది. గ్యాస్‌ సబ్సిడీ ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది..!

Credits: Ap2tg.com
(Visited 482 times, 1 visits today)