Home / Inspiring Stories / 25000 అడుగుల ఎత్తు నుండి పారాచూట్‌ లేకుండా జంప్ చేశాడు.

25000 అడుగుల ఎత్తు నుండి పారాచూట్‌ లేకుండా జంప్ చేశాడు.

Author:

ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ ఫర్ఫెక్ట్ అంటే ఇదేనేమో, ఒక మనిషి రోజు పారాచూట్‌ వేసుకొని చేసె పనిని ఈసారి అది వేసుకోకుండ చేసాడు. అతనే అమెరికాకు చెందిన లూకీ అకిన్స్‌. అమెరికా పారాచూట్‌ అసోసియేషన్‌ కు సేఫ్టీ అండ్‌ ట్రైనింగ్‌ అడ్వైజర్‌గా పనిచేస్తున్న అకిన్స్‌ ఇప్పటికే 18000 వేల సార్లు స్కైడైవ్‌లు చేశాడు. ఈ 42ఏళ్ల ఎకీన్స్‌ కు పారాచూట్‌ లేకుండా జంప్ చేయలన్న కోరిక కలిగింది. తోచిందే తడవుగా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. చివరకు దాదాపు 25,000 అడుగుల ఎత్తు (7,620మీటర్లు)పై నుంచి పారాచూట్‌ ఉపయోగించకుండా దూకి రికార్డు సృష్టించాడు.

Man jumped from 25000 feet

ఈ సహాసం చేసె క్రమంలో ఎకీన్స్‌ మొత్తం రెండు నిముషాలు గాలిలొ ఉన్నాడు మరియు క్రిందకు పడే క్రమంలో 193 కిలోమీటర్ల వేగాన్ని కూడా చేరుకున్నాడు. భూమికి చేరువ అయిన తర్వాత అప్పటికే ఏర్పాటు చేసిన 100 అడుగుల పొడవు, వెడల్పు ఉన్న వలలో సురక్షితంగా దూకాడు. ఇలాంటి సాహాసం చేసి విజయం సాధించిన మొదటి వ్యక్తిగా ఎకీన్స్‌ రికార్డుల్లొ నిలిచాడు. ఆ సాహసాన్ని మీరు కూడా చూడండి.

(Visited 641 times, 1 visits today)