Home / Political / అమ్మ మృతిపై మాకు అనుమానాలున్నాయి.

అమ్మ మృతిపై మాకు అనుమానాలున్నాయి.

Author:

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి అందరిని శోకసంద్రంలో ముంచింది. 75 రోజుల పాటు బయటకు రాకుండా ఆసుపత్రిలోనే ఉండిపోయిన అమ్మ చివరకి డిసెంబర్ 5 న ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. ఐతే అమ్మ ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు ఆమె ఆరోగ్యం కుదుటపడుతుందని తొందరలోనే అమ్మ ఆరోగ్యంగా బయటకి వస్తారని ఆసుపత్రి, ఆమె పార్టి వర్గాలు తెలిపాయి కాని వారి మాటలన్ని ఉత్తి మాటలయ్యాయి. ఇప్పుడు ఆ మాటల మీద అనుమానంతోనే అమ్మ మృతిపై విచారణ జరపాలని కోర్టుకు ఎక్కాడు చెన్నై కి ఒక లాయర్.

madras-high-court-judge-on-jayalalithaas-death

అమ్మ 75 రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పుడు, ప్రతిసారి ఆమె ఆరోగ్యం మెరుగవుతుంది అని బులెటిన్ విడుదల చేసారే తప్ప ఏనాడు అమే ఫొటొ చూపలేదని, కనీసం ఆమెను కలవకుండా అందరిని అడ్డుకున్నారని చివరికి ఆమె చనిపోయిన సమయం గురించి సరైన సమచారం ప్రజలకు చేరకుండా చేసారని పిటిషనర్ వాదించాడు. అసలు అమ్మకు ఏం జరిగింది? ఎప్పుడు ఆసుపత్రిలో జాయిన్ అయ్యింది? ఎటువంటి చికిత్స, ఎప్పుడు చేసారు? అన్న విషయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని వాదించారు. ఆ వాదనలతో ఏకీభవించిన మద్రాస్ హైకోర్ట్ జస్టిస్‌ వైద్యనాథన్‌ దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ఆదేశించారు. ఒకనోక సమయంలో అమ్మ పార్ధివ దేహాన్ని ఎందుకు సమాది నుండి బయటకు తీసి పరీక్షలు చేయకూడదు అంటూ ప్రశ్నించారు. దీనితో అమ్మ మృతిపై ప్రజల్లో ఉన్న సందేహాలు తీరుతాయి అని వ్యాక్యానించారు. ప్రభుత్వం కోర్టుకు ఎం నివేదిక ఇస్తుందో చూడాలి.

(Visited 262 times, 1 visits today)