అప్పుడే ఆరేళ్లవుతోంది. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్న నేత వైఎస్ రాజశేఖర రెడ్డి. హెలీకాప్టర్ ప్రమాదంలో కన్ను మూసి ఈ రోజుకి ఆరు సంవత్సరాలు. 30ఏళ్ల రాజకీయ జీవితం లో డైనమిక్ సీఎం గా రాజశేఖర రెడ్ది తీరు అద్బుతం అన్నవారే ఎక్కువ మంది. ఐతే అంతేస్తాయిలో అపకీర్తినీ మూట గట్టుకున్న ఈ రాయల సీమ పులివెందుల బిడ్ద. ప్రజల్లో ఎక్కువ మంది మనసుల్లో మాత్రం మహా నేత గా, జన రంజక నాయకుడిగా మిగిలిపోయారు.
వృత్తి రీత్యా వైధ్యుడైనా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ తనదైన స్టైల్ రాజకీయాలను. పరిచయం చేసారు. ఫీజ్ రీ ఎంబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ, 108 వంటి పథకాలు వైఎస్ ని పేదల దేవుడి గా మార్చేసాయ్. మొదటిసారి 2004 లో కాంగ్రేస్ తరఫున ముఖ్య మంత్రి గా ఎన్నికైన ఆయన. ఆ ఎన్నికలకు ముందు రాష్ట్రం అంతా కాలినడక న తిరుగుతూ చేసిన పాదయాత్ర దేశవ్యాప్త సంచలనమైంది. ఆ పాదయాత్ర ఎంతగా సక్సెస్ అయిందంటే ప్రతిపక్ష నేత అయిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్ర బాబు కూడా తర్వాతి ఎన్నికల్లో అదే పద్దతిని అనుసరించారు. రాజశేఖర్ రెడ్డి హయాం లో అన్ని ప్రభుత్వ పతకాలకు ఇందిరా రాజీవ్ ల పేరు పెడుతున్నారు అని విమర్శలకు గురైన ఆయన పేరునే ఇప్పుడు కొన్ని వందల మంది తమ పిల్లలకు పెట్టుకుంటున్నారు. సామాన్య జనం లో కలిసి పోయే విధంగా పంచె కట్టూ, అక్కా, చెల్లెమ్మా అంటూ ఆయన పలకరించే తీరూ.. ‘నిన్నటి తరం నాయకుడు ఎన్టీఆర్ ని గుర్తు చేసేలా ఉన్నాయి” అన్న వాళ్ళు కోకొల్లలు.నిజానికి తెలుగు దేశం పార్టీ లోనే ఇలా ఎన్టీఆర్ ని గుర్తుకు తెస్తున్నారు అనిపించుకున్న వాళ్ళెవరూ లేక పోవటం గమనార్హం.
ఎక్కువగా రైతు సంక్షేమానికీ, సామాన్యుడి ఆరొగ్యనికీ, విధ్య కూ అదిక ప్రాధాన్యం ఇచ్చిన వైఎస్. అదే స్తాయిలో ఓబులా పురం, బయ్యారం వంటి గనుల అక్రమాల్లోను అంతే స్థాయి విమర్శలనూ ఎదుర్కున్నారు. అత్యంత విలువైన భూముల నీ సొంత లాభాలకోసం పలు కంపెనీలకు కట్టబెట్టారు అన్నవాళ్ళూ లేకపోలేదు.నక్సల్స్ తో చర్చల దిశగా ప్రయత్నించి శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నించిన రాజశేఖర్
రెడ్డి ప్రయత్నం ఫలించకపోయినా, ఒక గొప్ప పరిష్కారం వైపుగా అడుగులు వేయించిది. ఐతే ఇవేవీ జనం లో ఆయన పాపులారిటీని తగ్గించలేక పోయాయ్. రెండుసార్లు అప్పటి సమైక్య రాష్ట్రానికి ముఖ్య మంత్రి పీఠాన్ని కాంగ్రేస్ దక్కించుకోవటానికి ముఖ్య కారణం వైఎస్సే అనటం ఎంత మాత్రమూ పొరపాటు కాదు. కొన్ని సార్లు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం తో తలపడ్డ సందర్బాలూ లేకపోలేదు. జలయఙ్ఞం పేరుతో రాష్ట్ర నీటి సమస్యలని తీర్చాలన్నది వైఎస్ తన కల అనేవారు. రెండో సారి కూడా ఆయన ముఖ్య మంత్రి అయ్యాక పూర్తి నాయకత్వాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. ప్రతీ శాఖనీ తన కనుసన్నల్లోనే నడిపారు. నియంతలా ప్రవర్తిస్తున్నారు అని సొంత పార్టీలోని మనుషులే విమర్శించినా పట్టించుకోలేదు. ప్రజలకు అన్యాయం జరిగే ఏ చిన్న విశయాన్ని కూడా సహించేది లేదని మీడియా ముందే అధికారులకీ, ప్రజా ప్రతినిదులకీ తెగేసి చెప్పారు.
ఇలా ప్రతి అడుగులోనూ ఒక డైనమిక్ గా పేరుతెచ్చుకొని ప్రత్యర్థుల తోనూ మెచ్చుకో బడ్డ ఈ మహా రాజకీయ వేత్త అసలెవరూ ఊహించని విధంగా మరణించటం. దేశవ్యాప్తంగా దిగ్బ్రాంతి కర వార్త అయింది. అప్పటినుంచే ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ సంక్షొభం మొదలైందంటారు రాజకీయ విశ్లేషకులు. అరవయ్యేళ్ల వ్యక్తి గత జీవితం లోనూ, 30 ఏళ్ళ రాజకీయ ప్రస్తానం లోనూ ఎక్కడా తడబడని ఒక మనిషినీ, ముఖ్యంగా ఒక రాజకీయ మేధావినీ కోల్పోవటం విషాదమే. 2009 సెప్టెంబర్ 2 ప్రజల గుండెల్లో ఒక శాపగ్రస్త దినం లా నిలబడిపోయింది.
మరోసారి వైఎస్ గారికి నివాళులర్పిస్తూ. ఆయన కలలు కన్న ఆర్థిక సమస్యలు లేని రైతు నవ్వుని చూసే రోజు కోసం ఎదురు చూస్తూ.. ప్రజలతో పాటుగా అలజడి.కాం కూడా జోహార్లర్పిస్తోంది.