Home / Entertainment / మహేష్ బాబు ని బలవంతం చేస్తున్న డైరెక్టర్.

మహేష్ బాబు ని బలవంతం చేస్తున్న డైరెక్టర్.

Author:

‘శ్రీమంతుడు’ బ్లాకు బస్టర్ హిట్ తో మంచి జోష్ పై ఉన్న మహేష్ బాబు ఒక కొత్త సంధిగ్దం లో పడ్డాడట. ఒక దర్శకుడికి మొహమాటం తో ఎస్ చెప్పలేకా నో అనలేకా సత్మతమి పోతున్నాడట. ఆయన చెప్పినట్టు చేస్తే తాను గత 16సంవత్సరాలుగా పాటిస్తున్న ఒక పద్ధతికి తానే వ్యతిరేకమ అయిపోయే పరిస్తితి ఎదురౌతుందని భయపడి పోతున్నాడని టాక్. మహేష్ బాబు ఇప్పటికే  తాను రీమేక్ సినిమాలకు పూర్తి వ్యతిరేకమని ఒక భాషలో ఒక హీరో చేసిన సినిమా చేయడానికి తనకు ఎలాంటి ఎగ్జైట్మెంట్ కలగదని అందుకే తాను రీమేకుల్లో నటించనని మిగిలిన వారి సంగతి చెప్పలేను గానీ తాను మాత్రం రీమేక్ జోలికే వెళ్ళను అని మీడియా ఇంటర్వ్యూలలో చెపుతూ వచ్చాడు. అందుకే మహేష్ బాబు అప్పుడప్పుడూ తన కెరీర్ కి విపరీతంగా ప్లస్ అవుతాయి అనిపించే భారీ రీమేక్ ఆఫర్లు కూడా వదులుకున్నాడు. అయితే ఈసారి మహేష్ బాబు పై ఈ విషయం లో ఒత్తిడి ఎక్కువగానే ఉన్నట్లు  తెలుస్తోంది. తమిళం లో ఈమధ్యనే విడుదలై సంచలన విజయం సాధించిన ‘తని ఒరువన్’ సినిమాను మహేష్ తో రీమేక్ చేయాలని డైరెక్టర్ జయం రాజా చాలా పట్టుదలగా ఉన్నాడట. నిన్నటితరం అందగాడు అరవిందస్వామి విలన్ గా నటించిన ఈ సిన్మా  తమిళం లో మంచి టాక్ సొంతం చేసుకుంది. రామ్ చరణ్ ఇప్పటికే ఈ సినిమ పై ఇంట్రస్ట్ గా వున్నాదని వార్తలు వచ్చినా దర్శకుడు జయం రాజా మాత్రం ఏదోవిధంగా ఈ సినిమాని మహేష్ బాబు తోనే తీయాలని పట్టుదల గా ఉన్నాడట. ఎలా ఐనా “తనీ ఒరువన్” తెలుగు రీమేక్ లో మహేష్ నటించేలా విపరీతమైన ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ సినిమా రీమేక్ రైట్స్ గురించి చరణ్ విపరీతంగా ప్రయత్నిస్తున్నా ఈ సినిమా తెలుగు రీమేక్ కు తనే దర్శకత్వం వహించాలని హీరో పాత్రను మహేష్ తో చేయించాలని చాల పట్దుదలతో ఉన్నాడట రాజా.

మహేష్ బాబుకి రీమేక్ అంటేనే పడదని తెలిసినప్పటికీ అతడితో సంప్రదింపులు జరిపి మహేష్ బాబు కోసం తమిళ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కూడ ఏర్పాటు చేశాడని తెలుస్తోంది. ఐతే మహేష్ ఈ సినిమా చూడటమే కాకుండా దర్శకుడు రాజాను విపరీతంగా అభినందించారని తెలియటం తో సినీజనాలు ఈ విశయం పై ఎక్కువగానే ఆరాలు తీస్తున్నారు. దీనిని బట్టి చూస్తూ ఉంటే మహేష్ తన పద్ధతిని పక్కనబెట్టి తొలిసారి రీమేక్ లో నటిస్తాడా అన్న అనుమానం చాలా మందినే తొలుస్తోంది.

ఇక “తనీ ఒరువన్” విషయానికి వస్తే ఇది గౌతమ్ మీనన్ సినిమాలని తలపించే ఓ పోలీస్ ఆఫీసర్ కి హై ప్రొఫైల్ క్రిమినల్ కి మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో వచ్చిన కథ. తమిళ్ లో హీరోగా జయం రవి, హీరోయిన్ పాత్రలో నయనతారా నటించగా విలన్ పాత్రలో అరవింద్ స్వామి నటించారు. ఈ సినిమా థ్రిల్లింగ్ గా సాగడంతో తమిళంలో ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.మరీ ముఖ్యంగా అరవింద స్వామి విలనిజం బాగా క్లిక్ అయిందట ఈ సినిమాలో నటించడానికి అంగీకరిస్తే మహేష్ బాబు  ఖాతాలో మరో ‘పోకిరి’ లాంటి బ్లాకు బస్టర్ హిట్ నమొదవుతుందని జయం రాజా చెపుతున్నారట. ఐతే మహేష్ ఈసినిమా రీమేక్ విషయంలో ఎటువంటి నిర్ణయం తెసుకోవాలో అర్ధం కాక అయోమయంలో పడిపోయినట్లు టాక్.. మరి మహేష్ తన నియమాన్ని పక్కన పెడతాడా తన మాటపైనే నిలబడతాడా అనేది త్వరలోనే తెలుస్తుంది.

(Visited 74 times, 1 visits today)