Home / Entertainment / మహేష్ కి పోటీగా మారిన అఖిల్ అక్కినేని

మహేష్ కి పోటీగా మారిన అఖిల్ అక్కినేని

Author:

ఆరడుగుల హైట్. అద్దిరిపోయే స్కిన్ టోన్ బాలీవుడ్ హీరోని తలపించే గ్లామర్, అమ్మాయిలనే కాదు చూసిన వారందర్నీ మైమరపించే స్మైల్ అండ్ లుక్స్. ఇవన్నిటికీ అసలైన ఎఫెక్ట్ ఇచ్చే సూపర్ ఫిజిక్ ఇప్పటివరకూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ పోలికలతో ఉన్నది టాలివుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కడే. నటన లో ఆయన ఎక్కడా తగ్గకున్నా ఆయన ప్లస్ పాయింట్ మాత్రం మహేష్ అందమే అని చెప్పొచ్చు. ఐతే ఇప్పటి దాకా ఇది నిజమే నేమో గానీ ఇక ముందు మహేష్ కి అక్కినేని యువ వారసుడు అఖిల్ నుంచి గట్టి పోటీనే ఎదురవ్వొచ్చంటున్నరు సినీ విశ్లేషకులు. ఎందుకటే పైన చెప్పిన ప్లస్ పాయింట్స్ అన్నిట్లోనూ మహేష్ కి చాలా దగ్గరలో ఉన్నాడు అఖిల్.   ఒక వేళ అఖిల్ గనక నటనలో తనని
తాను నిరూపించుకుంటే భవిశ్యత్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు స్థానాన్ని ఆక్రమించగలిగే స్టార్ అక్కినేని అఖిల్.

ఇంకా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే. యాడ్స్ లో దూసుకు పోతున్నాడీ యువ సిసింద్రీ. యాడ్ ప్రపంచంలో తొలి అడుగే  టైటన్ లాంటి భారీ ఎండోర్స్ మెంట్ తో యాడ్ వరల్డ్ లోకి అడుగు పెట్టడం సామాన్య విషయమేం కాదు. గతం లో అమీర్ ఖన్, కత్రినా కైఫ్ లాంటి స్టార్లు అంబాసిడర్లుగా చేసిన ఒక బ్రాండ్ కి సెలెక్ట్ అవటం ద్వారా దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. అంతే కాదు అఖిల్ రెండో యాడ్ మౌంటైన్ డ్యూ దీనికీ గతం లో సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నరు. ఇలా ముందు ముందు ఇండస్ట్రీ లో అఖిల్ సృష్టించ బోయే దుమారాన్ని ముందుగా యాడ్ వరల్డ్ గుర్తించింది. ఇంకో విశయమేంటంటే కార్బన్ మొబైల్స్ కూడా అఖిల్ నే తమ  అంబాసిడర్ గా తీసుకోబోతోంది. అసలు ఒక్క సినిమా కూడా చేయకుండనే ఇలా ఉందంటే ఇక సినిమాలు మొదలైతే…

ఇప్పటి దాకా సౌత్ ఇండస్ట్రీ మొత్తం లో ఎండోర్స్ మెంట్స్ లో టాప్ గా ఉన్న మహేష్ బాబు ని ఇప్పటివరకూ ఎవరూ బీట్ చేయలేక పోయారు కానీ ఈ సిసింద్రీ తొలి సినిమాకు ముందే ముచ్చటగా మూడో యాడ్ కీ సంతకం చేసేసాడు. ఇలాగే ముందు ముందు సాగితే అఖిల్ దూకుడుని తట్టుకోవటం మహేష్ కి కష్టమే అంటున్నారు సినీ పండితులు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్తితి ఇదివరకు లా లేదు. సినిమా ఇండస్ట్రీ కార్పోరేట్ పోకడలతో కొత్తగా మారిపోతోంది. ఒక స్టార్ కి జనం లో ఉన్న క్రేజ్ ని నిరూపించేది అతనికి వచ్చే యాడ్లే. ఎంత ఫాలోయింగ్ ఉన్న హేరో ఐతే అన్ని యాడ్స్. ఇది ఆదాయ మార్గమే కాదు కెరీర్ లో ఒక నటుడు ఏ స్తాయిలో ఉన్నాడు అనేదానికి గ్రాఫ్ లాంటిది. సో దీన్ని బట్టి చూస్తే అఖిల్ ఇప్పుడు కెరీర్ పరంగా మంచి బూస్ట్ లో ఉన్నట్టే.

(Visited 60 times, 1 visits today)