Home / Entertainment / మహేష్ లాభం లేకుండానే సమాజ సేవ చెయ్యటం లేదు..!

మహేష్ లాభం లేకుండానే సమాజ సేవ చెయ్యటం లేదు..!

Author:

తేజా కు ఏమయింది? ఎందుకిలా చేస్తున్నాడు? ఇప్పుడు టాలివుడ్ లో చక్కర్లు కొడుతున్న అనుమానాలివే. ప్రిన్స్ మహేష్ బాబును టార్గెట్ చేస్తూ దర్శకుడు తేజా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో టాలీవుడ్ వేడెక్కిపోతోంది. కావాలనే ఇలా మాట్లాడు తున్నాడా? లేక వ్యక్తి గత కారణాలేమైనా ఉన్నాయా? అనేది ఇంకా తెలియలేదు గానీ మహేష్ బాబు కూడా తేజా మాటల వల్ల బాగానే హర్ట్ అయ్యాడట. కానీ ప్రిన్స్ మాత్రం ఇంకా తేజా కి రిటార్ట్ ఏమీ ఇవ్వకుండా మౌనం గానే ఉన్నాడు.

“ఈమధ్య టాలీవుడ్ స్టార్స్ గ్రామాలను దత్తత తీసుకునే కల్చర్ ను బాగా అనుసరిస్తున్నారు కదా మీకూ అలాంటి ఉద్దేశ్యం ఏమైనా ఉందా?” అని ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ సమాజ సేవ కోసం తహతహ లాడిపోవటం లేదనీ వారి సొంత లాభం లేకుండా ఏపనీ సినిమా వాళ్ళు చేయరనీ, వారు పెద్ద మొత్తాలలో కట్టవలసిన ఆదాయపు పన్ను మినహాయింపు కోసం ఇటువంటి  పనులు చేస్తున్నారని వ్యాఖ్యానించిన తేజా అంతటితో ఆగకుండా  డైరెక్ట్ గానే  మహేష్ పేరును ఉదహరిస్తూ మరో సంచలన వ్యాఖ్య చేసాడు. “మహేష్ నిజంగా గ్రామాలను అభివృద్ధి చేయాలని అనుకుంటే అతడు నటించిన ‘శ్రీమంతుడు’ ఘన విజయం వరకు ఆగనక్కరలేదు ఎన్నో సంవత్సరాల క్రితం సూపర్ హిట్ అయిన ‘ఒక్కడు’ సినిమా తరువాత ఈ పని చేసి ఉండే వాడు”  అంటూ మహేష్ పై సెటైర్లు వేసాడు తేజ.

మహేష్ తో ‘నిజం’ లాంటి సంచలనాత్మక సినిమాను తీసి నటుడిగా నందీ అవార్డును తెప్పించిన తేజా ఇలా కామెంట్ చేయడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఐతే చాలా మంది తేజా కామెంట్స్ ని పెద్దగా పట్టించుకోవటం లేదు.  అతని పరాజయాల తాలూకు డిప్రెషన్ వల్లే తేజా ఇలా మాట్లాడుతున్నాడనీ.. ఇదివరలో కూడా అతని గురువు రాం గోపాల్ వర్మ లా నెగెటివ్ గా మాట్లాడి పేరు తెచ్చుకోవాలని చూసాడనీ అంటున్నారు . అంతేకాదు ‘ఒక్కడు’ సినిమా విడుదల అయిన సమయంలో మోడీ లేడు, తెలంగాణ గ్రామజ్యోతి అనే పథకమూ లేదు, ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల దత్తత స్కీము లేదు అన్న విషయాలు ఇంత పెద్ద మేధావీ, క్రియేటివ్ దర్శకుడూ అయీ  తేజాకు తెలియదా ? అంటూ చాలామంది బాహాటంగానే అంటున్నారట. హోరాహోరి మూవీ సక్సెస్ అనేది తేజాకి ఇప్పుడు కీలకం, ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ యాక్టివీటీస్ స్వయంగా తేజానే నిర్వహిస్తున్నాడు. అయితే ప్రమోషన్స్ లో భాగంగానే తేజ తాజాగా కాంట్రవర్సీ కామెంట్స్ ని విసిరాడు ఇలా నెగెటివ్ గా మాట్లాడి వర్తల్లో నిలవటానికే తేజా ప్రయత్నం అని చెప్పుకుంటున్నారట సినీ పరిశ్రం లోని జనాలు. ప్రభుత్వం నుండి అందివచ్చే లాభాలను పక్కన పెడితే, చేసేది మంచి పని అయినప్పుడు. చేసేవారిని అభినందించక పోయినా చేసే వారి మీద ఇలాంటి విరుపులెందుకు ఈ విధమైన కామెంట్స్ చేయటం కరెక్ట్ కాదనీ ఎప్పుడూ వివాదాల్లోకి రాకుండా ఉనా తేజా ఇలా అనటం సరి కాదనీ తేజకి మహేష్ ఫ్యాన్స్ గట్టిగానే సమాధానం చెబుతున్నారు. ఏమైనా రేపటి తన సినిమా ‘హోరాహోరి’ సినిమా ప్రమోషన్ కోసం ఇంకోలా ట్రై చేయాలి గానీ ఇలా పక్క వారిని టార్గెట్ చేసి వార్తల్లోకెక్కాలనుకోవటం తేజా కెరీర్ కి మంచిది కాదనీ అంటున్నారట సినీ రంగ ప్రముఖులు.

(Visited 103 times, 1 visits today)