Home / Entertainment / మహేష్ తో వినాయక్ 100 కోట్ల ప్రాజెక్ట్ రెడీ!

మహేష్ తో వినాయక్ 100 కోట్ల ప్రాజెక్ట్ రెడీ!

Author:

 శ్రీమంతుడు హిట్‌తో మరోసారి మహేష్ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఒక మెసేజ్ ఓరియెంటెడ్ కథ అయినా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తీసిన ఈ సినిమా మొదటిరోజు నుండి కలెక్షన్ల సునామి సృస్టిస్తుంది. ఇక ఓవర్సీస్ లో అయితే ఇప్పటికే 2.7 మిలియన్ డాలర్లను వసూలు చేసిన శ్రీమంతుడు 3 మిలియన్ మార్క్ ని టచ్ చేస్తుందని అంచనా. శ్రీమంతుడు  తెచ్చిన విజయోత్సాహం తో ప్రిన్స్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం మీద్ ద్రుష్టి పెట్టనున్నాడు. అయితే బ్రహ్మోత్సవం తరువాత ఏ సినిమా చేయనున్నాడు. డైరెక్టర్ ఎవరు అన్న విషయాల్లో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అగ్ర దర్శకులంతా మహేష్ తో చేయడానికి రెడీగా ఉన్నా కూడా వినాయక్ పేరే ఎక్కువగా వినిపిస్తోంది.

VV Vinayak Srimathudu Audio function

 శ్రీమంతుడు సినిమా ఆడియోకి అటెండ్ అయిన వినాయక్ ప్రిన్స్ మహేష్ తో సినిమా తీయాలని ఎప్పటినుండో అనుకుంటున్నానని, మహేష్ బాబుతో తనకి 100 కోట్ల బడ్జెట్ తో సినిమా తీయాలని ఉందని తన కోరిక కూడా పబ్లిక్ గానే ఎనౌన్స్ చేశాడు. అయితే టాలీవుడ్లో 100 కోట్ల బడ్జెట్ సినిమా అంటే ఖర్చు పెట్టే ప్రోడ్యూసర్లు ఉన్నా మళ్ళీ అవి రిటర్న్ పొందే సబ్జెక్ట్ కావాలి. అయితే డివివి దానయ్య మాత్రం వినాయక్ చెప్పిన కథకు బాగా ఇంప్రెస్ అయ్యాడట.. అంతేకాదు మహేష్ ఓకే అంటే సినిమా చేద్దామని, 100 కోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట దానయ్య. మహేష్ ఒక్కడే ఇప్పుడు అన్ని చోట్లా ఖలేజా ఉన్న హీరో.. ఇక ఓవర్సీస్ లో అయితే మహేష్ బొమ్మ పడితే చాలు కలెక్షన్ల సునామియే కనిపిస్తుంది. ఒక మంచి సున్నితమైన, ఉదాత్తమైన శ్రీమంతుడు సినిమాకే ఇలాంటి స్టన్నింగ్ కలెక్షన్లు వస్తే వినాయక్ డైరక్షన్లో మాంచి మాస్ కమర్షియల్ పైసా వసూల్ మూవీ వస్తే.. బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. ప్రస్తుతం మహేష్ బాబు తో కథా చర్చల్లో పాల్గొనే అవకాశం కోసం చూస్తున్నాడట వినాయక్. అదీగాకా తను డైరెక్ట్ చేస్తున్న అఖిల్ డెబ్యూ మూవీ పనుల్లో కూడా బిజీగా ఉన్నాడు వినాయక్.ముందు కథ మహేష్ బాబు కి చెప్పి తను ఓకే అంటే ఇక మిగతా వారి గురించి, సినిమా ఎప్పుడు తీసేదాని గురించి వివరాలు తెలియచేసే అవకాశం ఉంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు కూడా ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాను సెప్టెంబర్ నెలలో స్టార్ట్ చేస్తున్నాడు. డివివి దానయ్య కూడా రామ్ చరణ్, శ్రీనువైట్ల కాంబోలో వస్తున్న ‘మెరుపు’ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇక వీరు ముగ్గురు ప్రస్తుతం ఉన్న ఈ ప్రాజెక్ట్ లు పూర్తిచేసి కాని ఈ సినిమాకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.మరి మహేష్  వినాయక్ అంటే సినిమా కత దగ్గరనుంచి బిజినెస్ దాకా మామూలుగా ఉండదండీ బాబూ..మహేష్ ప్లానింగ్ మామూలుగా లేదు.. ఈ స్పీడు, ప్లానింగ్ చూస్తుంటే నంబర్ వన్ స్థానం లో ఫిక్స్ అయిపోయేలా ఉన్నాడు. ఎనీవేస్ గుడ్లక్ టు ప్రిన్స్ మహేష్..

(Visited 110 times, 1 visits today)