Home / Inspiring Stories / ముస్లింలు రంజాన్ నెలలో చేసే ఉపవాసం వెనుకున్న ముఖ్య ఉద్దేశ్యం ఏంటో తెలుసా..?

ముస్లింలు రంజాన్ నెలలో చేసే ఉపవాసం వెనుకున్న ముఖ్య ఉద్దేశ్యం ఏంటో తెలుసా..?

Author:

Ramdaan Fasting

ముస్లిం మతస్తులు అనుసరించే హిజ్రీ క్యాలెండర్ లో అత్యంత పామ్రుఖ్యత సంతరించుకున్న నెల రంజాన్. ఈ మాసంలో నిర్వర్తించవలసిన ముఖ్య విధి ఉపవాసాలు, ఇతర నేలలతో పోలిస్తే రంజాన్ నెల ముస్లింలకి చాలా ముఖ్యమైనది, ఈ నెలలో చేసే ఉపవాసలకి ఇతర ప్రార్థన రూపాలన్నిటి కంటే అత్యంత పామ్రుఖ్యతని కలిగిఉంటుంది. ఉపవాసం గురుంచి ఖురాన్ లో ఇలా రాసి ఉంటుంది.

‘‘మీరు సన్మార్గులుగా మారడానికి మీకు పూర్వపు జాతులలానే మీకు కూడా ఉపవాసాల్ని తప్పనిసరిగా గావించడం జరిగింది.’’

సంవత్సరం మొత్తంలో కేవలం ఒకనెల రోజుల పాటు పగటి వేళ ఆహారపానీయాలు మానివేసినంత మాత్రాన మనిషి పూర్తి సన్మార్గ బద్ధుడవుతాడా? అన్న అనుమానం రావచ్చు. అసలు ఉపవాసం అంటే ఏమిటి? దీని వెనుకున్న ముఖ్యోద్దేశం ఏమిటి? ఇతర ఆరాధనలపై దీనికి శ్రేష్ఠత ఎలా సమకూరింది. అన్న విషయాలు తెలిస్తే ఇటువంటి అనుమానమే రాదు.

ఉపవాసం అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఆహారపానీయాలకు దూరంగా ఉండటం మాత్రమే కాదు, ఉపవాసం అంటే కడుపుకి విశ్రాంతితో పాటు ళ్లు ఉపవసించాలి, అంటే చెడు దృష్టితో చూడరాదు, చెవులు ఉపవసించాలి.. చెడు మాటలు, చాడీలు వినరాదు. చేతులు ఉపవసించాలి.. చెడు పనులు చేయకూడదు. చెడుకు సాయపడకూడదు. కాళ్లు ఉపవసించాలి.. చెడు మార్గంలో నడువరాదు. చెడుకు సాయంగా అడుగు వేయరాదు. మనసులో దుర్మార్గమైన ఆలోచనలు రానివ్వరాదు. ఇది చాలా కష్టసాధ్యమైన విషయం. కాని నిరంతర దైవధ్యానం వల్ల దుర్మార్గపు ఆలోచనల నుంచి బయటపడవచ్చు.

నాలుకతో ఎటువంటి చెడు మాటలు అనరాదు, తిట్లు, పరుష పదాలు నాలుకపై రానీయకూడదు. ఇతరుల్ని గురించి పెద్దగా మాట్లాడటం కాని, చాడీలు కానీ పలుకకూడదు. అసత్యాన్ని దగ్గరకు రానివ్వరాదు. ఎవరితోనూ తగాదా పడకూడదు. ఇతరులెవరైనా మనతో తగువుకు వస్తే కేవలం ‘నేను ఉపవాసంతో ఉన్నాను’ అని చెప్పి అక్కడి నుంచి వైదొలగమన్నారు మహాప్రవక్త (స). ఇలా సర్వాంగాలు ఉపవసిస్తే అది నిజమైన ఉపవాసం.

‘‘దైవ ప్రసన్నత కోరి ఆయన కోసం అన్ని విధాల సంపూర్ణంగా పాటించేదే ఉపవాసం. అలాకాక వృధాగా కడుపు మాడ్చుకునే మీ పస్తులతో దైవానికి ఎట్టి సంబంధమూ లేదు’’

నమాజ్ ఎలా ఆచరించాలి..? అనే ప్రశ్నకి ఖురాన్ లో ఇలా సమాధానం చెప్పబడింది.

‘అంటే దైవాన్ని మనం మన ఎదుట దర్శిస్తున్నట్లుగా ఆచరించాలి. అది అందరికీ సాధ్యపడక పోవచ్చు. కనీస పక్షం దైవం మనల్ని గమనిస్తున్నాడనే భావనతో ఆచరించాలి. ఈ రెండూ లేకుంటే ఆ ప్రార్థనతో ఎలాంటి ఉపయోగమూ ఉండదు’

ఈ విషయంలో కూడా ఉపవాసం ఇతర ప్రార్థనల కంటే మేలైనది. ఉపవాసంలో బాహ్యాడంబరతపాలు కూడా చాలా తక్కువ. పక్కన ఎవరూ లేని ఏకాంత సమయంలో కూడా ఉపవాసి ఏమీ తినడు, తాగడు. ఎవరూ చూడక పోయినా అనుక్షణం దైవం తనను గమనిస్తున్నాడనే భావనతో ఉంటాడు. కాబట్టే ఉపవాసానికి ఆ శ్రేష్ఠత లభించింది.

ఉపవాసికి లభించే భౌతిక, ఆధ్యాత్మిక లాభాలు కూడా ఇన్నీ, అన్నీ కావు. ఇది కేవలం ఒక నెల రోజుల పాటు ఉగ్గపట్టుకుని ఉండే పస్తులు కావు. నెల రోజులు కాగానే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి అనుమతి లభించినట్లు కాదు. విశృంఖలత్వం ప్రోది చేసుకున్న వాతావరణంలో స్వీయ నియంత్రణను నేర్పేవే ఈ ఉపవాసాలు. ఆకలితో ఉన్న మనిషికి అతి కోపం రావడం సహజం. ఎవరైనా తగాదాపడి రెచ్చగొడితే ఉద్రేకం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అటువంటి స్థితిలో కూడా సహనాన్నీ, సంయమనాన్నీ పాటించడం అలవాటు చేస్తాయి రంజాన్ ఉపవాసాలు. ఇవి ఒక నెల కోసం మాత్రమే పరిమితమైన విధులు కావు. సంవత్సరంలో మిగిలిన పదకొండు నెలల పాటు జీవితాన్ని ఎలా గడపాలో బోధించే శిక్షణాకాలం. ఒక ఆహారపానీయాలపై మాత్రమే నియంత్రణ ఉండదు. మిగిలిన అన్ని విధులూ యథాతథంగా ఉంటాయి. మనిషి జీవన విధానంలో ఒక గట్టి క్రమశిక్షణను అలవరుస్తాయి ఈ ఉపవాసాలు.

సుఖసంతోషాల్లో తూగే ధనికులకు పేదల ఆకలి దప్పుల బాధలు ఎలా ఉంటాయో తెలియదు. ఉపవాసాల మూలంగా వారికి ఈ విషయం అనుభవపూర్వకంగా తెలిసి వస్తుంది. బాధపడేవారిని ఆదుకోవాలనే స్పృహ వారిలో కలుగుతుంది.

ఉవవాసాల వల్ల ఆరోగ్యానికి సంబంధించి కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. శరీరంలోని మలినాలన్నీ దూరమవుతాయుయి. శరీరం పరిశుభ్రం అవుతుంది. మనిషి తొందరగా అనారోగ్యంపాలు కాడు. ‘లంఖణం పరమౌషధం’ అంటుంది ఆయుర్వేద వైద్యశాస్త్రం. ఉపవాస సమయంలోని ఆచరణలు మనిషికి శారీరకంగానే కాక మానసికంగా కూడా పూర్తి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తాయి.

రంజాన్ఉపవాసాల ప్రాముఖ్యతను గురించి చెబుతూ.. ‘ఈ మాసంలో ఏ కారణం చేతనైనా ఒక ఉపవాసం తప్పిపోతే.. మీరు జీవితకాలమంతా ఉపవసించినా దాని విలువ తీరదు’ అంటారు మహప్రవక్త . ఆయనే మరో సందర్భంలో ‘ఉపవాసికి రెండు విధాలైన ఆనందాలు లభిస్తాయి. ఒకటి ఉపవాస దీక్ష విరమింపజేసే సందర్భంలో, మరొకటి అంతిమ దినాన ప్రతిఫలంగా లభించే దైవదర్శనంలోనూ’ అంటారు.

ఇది దైవగ్రంథం పవిత్ర ఖురాన్ అవతరించిన మాసం. ఈ నెల రోజుల్లో సాధ్యమైనన్ని ఎక్కువ మార్లు ఈ దైవగ్రంథాన్ని సంపూర్ణంగా పఠించాలి. కనీసం ఒక్కమారైనా పూర్తి గ్రంథాన్ని తప్పనిసరిగా పఠించాలి, వినాలి. ఈ నెల రోజుల రోజువారీ జరిపే అయిదు పూట ప్రార్థనలతో పాటు మరో ప్రత్యేక ప్రార్థన కూడా ఆచరించాలి. ప్రతిరోజూ రాత్రి ‘ఇషా’ నమాజ్‌ తర్వాత ఈ ప్రార్థన ఉంటుంది. దీన్ని ‘తరావీహ్‌’ అంటారు. సాధారణంగా పూర్తి ఖురాన్ కంఠస్థం చేసిన హాఫిజ్‌లే ఈ ప్రార్థన జరిపిస్తారు. ఈ నెల రోజుల్లో పూర్తి ‘ఖుర్‌ఆన్‌’ వినిపిస్తారు. ఇలా చదువగలిగిన వారితో పాటు చదువలేని వారికి కూడా ప్రార్థనతో పాటు పూర్తి ఖురాన్ ను ఆలకించే సౌభాగ్యం సమకూరుతుంది.

(Visited 1,935 times, 1 visits today)