Home / Inspiring Stories / మాకొద్దీ చదువుల టెన్షన్ అన్న తెలంగాణ ప్రభుత్వం.

మాకొద్దీ చదువుల టెన్షన్ అన్న తెలంగాణ ప్రభుత్వం.

Author:

డిటెన్షన్ విధానం తేవడం విద్యా హక్కును కాలరాయడమే అవుతుందని, ఇది అమల్లోకి వస్తే నిరుపేద విద్యార్థులు చదువుకు దూరమవుతారుని కాబట్టే డిటెన్షన్ విద్యా విధానాన్ని అమలు చేయటానికి తాము సుముఖంగా లేమనీ, ప్రస్తుత విధానంలో లోటుపాట్లు ఉంటే సరి చేయాలని, స్కూళ్లలో మౌలిక వసతులు పెంచాలని, డ్రాపౌట్స్‌ పెరగకుండా జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది.  డిటెన్షన్‌ విద్యా విధానం అంటే.. ప్రతి తరగతిలోనూ పబ్లిక్‌ పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష పాసయితేనే ఆ తర్వాతి తరగతికి ప్రమోషన్‌ వస్తుంది. లేకుంటే లేదు. ఇప్పుడు పద్ధతి అలా కాదు. పరీక్షలు- మార్కులు ఉన్నప్పటికీ అందరినీ ప్రమోట్‌ చేసి, తక్కువ మార్కులు వచ్చిన వారిపై ఆ తర్వాతి తరగతిలో ఫోకస్‌
పెట్టడం జరుగుతోంది. పదో తరగతిలో మాత్రమే పబ్లిక్‌ పరీక్ష ఉంటుంది.  ఎనిమిదో తరగతి వరకు నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, అలాగే పదో తరగతి బోర్డు పరీక్షలను తిరిగి ప్రవేశ పెట్టాలని విద్యారంగంపై జాతీయ స్థాయి అత్యున్నత సలహా మండలి సూచనల మేరకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కోరుతూ ఒక ప్రకటన చేసింది.

నో డిటెన్షన్ పాలసీ వల్ల విద్యాప్రమాణాలు దిగజారి పోతున్నాయని, అందువల్ల ఈ విధానాన్ని సమీక్షించాలని యుపిఏ ప్రభుత్వ హయాంలో అప్పటి హర్యానా విద్యా శాఖ మంత్రి గీతా బుక్కల్ నేతృత్వంలో నియమించిన సబ్ కమిటీ నో డిటెన్షన్ పాలసీపై రూపొందించిన నివేదిక అభిప్రాయ పడింది. ‘అణగారిపోతున్న విద్యా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రక్రియను పరిశీలించి, మధించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే విద్యార్థులు ఏమి నేర్చుకున్నారన్న అంశాన్ని పరిశీలించి దాని అనుసంధానంగానే ఐదునుంచి తదుపరి తరగతులకు ప్రమోట్ చేయాలి’ అని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఇదే అంశాన్ని ప్రధానంగా తీసుకుంటూ విధ్యా వ్యవస్తలో మార్పులు తేవాలనుకున్న కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.

అయితే ఈ విషయంలో తెలంగాణ సర్కారు  చాలా దృఢంగా వ్యవహరించి. డిటెన్షన్‌ విద్యావిధానం వల్ల. సమాజానికి చాలా ప్రమాదం అని, డ్రాపౌట్స్‌ పెరిగి బాలకార్మికులు పెరుగుతారని భయపడుతూ.. మన దేశంలో డిటెన్షన్‌ విద్యావిధానం వద్దుంటూ టీ సర్కారు కేంద్రానికి లేఖ రాసింది. ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వం డిటెన్షన్ విధ్యా విధానం వల్ల రాబోయే సమస్యలను వివరిస్తూ కేంద్రానికి తమ అభిప్రాయం తెలిపింది. పూర్తి ప్రమాణాలతో కసరత్తు చేసి ప్రతిపక్షల అభిప్రాయల ను కూడా పరిగణ లోకి తీసుకునే కేంద్రం అభిప్రాయాన్ని తిరస్కరిస్తూ లేఖ  రాసారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1971 నుంచి నాన్‌ డిటెన్షన్‌ అమల్లో ఉంది. 2009లో విద్యాచట్టం వచ్చినప్పటికీ అదే పద్ధతిలో విద్యా విధానాన్న ప్రభుత్వాలు  అమలు చేస్తున్నాయి. విద్యా విధానంలో నాణ్యత కోరవడుతోందని కేంద్రం ఇటీవల ఒక సమీక్ష నిర్వహించింది. అన్ని రాష్ర్టాలను డిటెన్షన్ విధానంపై అభిప్రాయాలు ఇవ్వాల్సిందిగా కోరింది. ఈ మేరకు అన్ని పార్టీలతో మంత్రి కడియం శ్రీహరి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో అన్ని పార్టీల నేతలు నాన్‌ డిటెన్షన్‌ విధానాన్నే కొనసాగించాలని ప్రభుత్వానికి స్పష్టం చేశారు.డిటెన్షన్ విధానం తేవడం విద్యా హక్కును కాలరాయడమే అవుతుందని, ఇది అమల్లోకి వస్తే నిరుపేద విద్యార్థులు చదువుకు దూరమవుతారుని ప్రతిపక్ష నాయకులు అభిప్రాయపడ్డారు జిల్లా విద్యాధికారులనుంచి, ఉపాధ్యాయ ప్రతినిధులనుంచి మంత్రి కడియం శ్రీహరి అభిప్రాయాలు తెప్పించారు. అదేమాదిరిగా రాజధానిలో మేధావులు, విద్యారంగ నిపుణుల్తో ఒక సమావేశం నిర్వహించారు. అన్ని వర్గాలనుంచి కూడా  డిటెన్షన్‌ విద్యా విధానం వలన వెనుక బడిన ప్రాంతాలకు, పల్లెల్లో విద్యార్థులకు నష్టమే అనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో కేంద్రానికి ఆమేరకు లేఖ రాశారు.

(Visited 120 times, 1 visits today)