Home / Political / నా పక్కింటి వారికిచ్చారు, ఇప్పుడు నాకు కూడా పర్మిషన్ ఇవ్వాల్సిందే.

నా పక్కింటి వారికిచ్చారు, ఇప్పుడు నాకు కూడా పర్మిషన్ ఇవ్వాల్సిందే.

Author:

కోర్టుకు వచ్చే కొన్ని కేసులు వింత వింతగా ఉంటాయి అలాంటి కేసే ఒకటి కర్ణాటక హైకోర్టు కు వచ్చింది. బెంగళూరుకి చెందిన మునిరాజు కొత్త ఇల్లు కట్టుకున్నాడు. కొత్త ఇంట్లోకి ఫిబ్రవరి 9 న గృహప్రవేశం చేయాలని డిసైడ్ అయ్యి అందరికి ఆహ్వాన పత్రాలు పంపించాడు. మమూలుగా గృహప్రవేశం చేస్తే ఎం బాగుంటుందని ఆ రోజు ఒక హెలికాప్టర్ ను అద్దెకు తీసుకొని ఆకాశం నుండి కొత్త ఇంటిపై పూల వర్షం కురుపించాలనుకున్నాడు. అదే విశయాన్ని ఇన్విటేషన్ కార్డులో కూడా ప్రింట్ చేయించాడు. హెలికాప్టర్ కోసం దక్కన్ సంస్థ వారిని సంప్రదించగా వారు ముందు ఈ కార్యక్రమానికి బెంగుళూర్ సిటీ పోలీసు కమిషనర్ నుంచి అనుమతి తీసుకురమ్మని చెప్పారు.

man asks high court permission for helicopter to drop petals during inauguration of my new house

దీనితో మునిరాజు పర్మిషన్ కొరకు బెంగుళూర్ సిటీ పోలీసు కమిషనర్ కి అప్లికేషన్ పెట్టుకున్నాడు. కాని ఇంతలో ఎమైందో కాని తనకు పర్మిషన్ ఇప్పించాలంటూ కర్ణాటక హైకోర్టు ను ఆశ్రయించాడు. తన పక్కింటి వ్యక్తి తన ఇంటి ఒపెనింగ్ కి ఇలానే హెలికాప్టర్ తో పూలు జల్లించాడని అప్పుడు అతనికి పర్మిషన్ ఇచ్చి నాకేందుకు ఇవ్వరని వాధించాడు మునిరాజు అంతటితో ఆగకుండా ఇప్పుడు పర్మిషన్ ఇవ్వకుంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం తన సమానత్వపు హక్కుకు భంగం కలుగుతుందని కోర్టుకి తెలిపాడు. అతడి వాదనతో ఓకింత ఆశ్చర్యపోయిన జడ్జ్ దీనిపై స్పందించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. దానికి బదులుగా ప్రభుత్వం ముందుగా మునిరాజు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తెచ్చుకొని తమకు సమర్పిస్తే హెలికాప్టర్ వాడుకోవడానికి పర్మిషన్ ఇస్తామని తెలిపింది. చూడాలి మునిరాజు ప్రయత్నం ఫలిస్తుందో? లేదో?

(Visited 444 times, 1 visits today)