Home / Political / పోకీమాన్ గో ఆడి ఇతను ఏం సాధించాడొ తెలిస్తే ఆశ్చర్యపోతారు.

పోకీమాన్ గో ఆడి ఇతను ఏం సాధించాడొ తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Author:

ఈమధ్య మనమందరం ఎదో ఒక సందర్భంలో పోకీమాన్ గో అనే ఆట పేరు వినే వుంటాము. మార్కెట్ లోకి విడుదల అయిన కొన్ని రోజులలోనే చాల ఫేమస్ అయ్యింది ఈ ఆట. ఇక ఇప్పుడు దాని గురించి ఎందుకంటారా? బ్రిటన్ కి చెందిన సామ్ క్లార్క్ అనే పోకీమాన్ గో ఆటగాడు సాధించిన ఘనత వలన ఈ వార్త రాయాల్సి వచ్చింది.

man walked 227 kilometers for pokemon game

బ్రిటన్ లో పోకీమాన్ గో ఆటకి సంబంధించి ఉన్న 1390 పోకీమాన్ పాకెట్ మొన్స్టర్స్ ని, 142 రకాల పోకీమాన్ స్పెసీస్ ను సామ్ పట్టుకున్నాడు. వాటన్నింటిని కలెక్ట్ చేయడం కోసం ఏకంగా 227 కిలోమీటర్లు నడిచిన సామ్. ఇలా నడిచి నడిచి మొత్తం 12 కిలోల బరువు తగ్గాడు. ఇన్ని నాళ్ళూ ఎన్నిసార్లు ఎక్సర్సైస్ చేయమన్న పట్టించుకోని సామ్ 227 కిలోమీటర్లు నడిచి, 12 కిలోలు తగ్గినందుకు చాలా ఆనందముగా ఉందని సామ్ భార్య హేళి తెలిపింది. చివరికి ఆట మొత్తాన్ని పూర్తి చేసిన సామ్, ఇప్పుడు పోకీమాన్ గో ఆట మీద మీటింగులు పెట్టీ ఆ ఆట ఎలా ఆడాలో ట్రైనింగ్ ఇస్తున్నాడు.

(Visited 1,824 times, 1 visits today)