Home / Entertainment / కర్ణాటకలో ప్రియురాలు ను హత్య చేసి, ఆమె తలతో పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ప్రియుడు

కర్ణాటకలో ప్రియురాలు ను హత్య చేసి, ఆమె తలతో పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ప్రియుడు

Author:

ప్రియురాలు మరోవ్యక్తితో చనువుగా ఉంటోందని ప్రియుడు ఉన్మాదంతో ఆమెను గొంతు కోసి చంపాడు. తలను మొండెం నుంచి కత్తిరించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చాడు. ఈ దారుణం కర్ణాటక రాష్ట్రంలోని కంచార్లపల్లిలో నిన్న(గురువారం) జరిగింది. శ్రీనివాసపురం పట్టణం గఫార్‌ ఖాన్‌ వీధికి చెందిన అజీజ్‌ (27) మొబైల్‌ షాపు నడుపుతున్నాడు. ఇతనికి గతంలోనే పెళ్లయింది.

అయితే బెంగళూరుకు చెందిన అయూబ్‌ ఖాన్‌ కూతురు రోషన్‌ఖానం (24)తో పరిచయం ఏర్పర్చుకొని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అజీజీ. అయితే రోషన్‌ఖానం ఇతర పురుషులతో చనువుగా ఉంటోందనే అనుమానంతో ఆమెను అంతమొందించాలని పథకం వేసుకొన్నాడుఅజీజ్. గురువారం చింతామణి తాలుకాలోని మురగమల్లా దర్గాలో పూజలు చేద్దామని నమ్మబలికి ఆమెను అక్కడికి తీసుకొచ్చాడు.

Man walks into police station with severed head

దర్గాను దర్శించుకున్నాక గ్రామ శివార్లలోని మామిడి తోపు షెడ్‌లోకి వెళ్లారు. అక్కడ అజీజ్‌ వేటకొడవలితో ఆమె గొంతు నరికి తల వేరుచేశాడు. తలను బ్యాగులో పెట్టుకొని బైక్‌పై శ్రీనివాసపురం స్టేషన్‌లో లొంగిపోయాడు అజీజ్.

(Visited 1 times, 1 visits today)