Home / Reviews / మన ఊరి రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్.

మన ఊరి రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్.

Author:

mana oori ramayanam movie review and rating

ఒకప్పుడు ప్రకాష్ రాజ్ లేకుండా సినిమాలే వచ్చేవి కావు అంతలా మన తెలుగు సినిమాలని శాసించాడు ఆయన, ధోని సినిమాతో తనలోని దర్శకుడిని కూడా ఇండస్ట్రీకు పరిచయం చేసాడు, ప్పుడు ‘మన వూరి రామాయణం’ అంటూ మరో కథ చూపించేందుకు సిద్ధమయ్యారు. మలయాళ చిత్రం ‘షట్టర్‌’కి రీమేక్‌ ఇది. రి ఆయన ప్రయత్నం ఎలా సాగింది?  ఇంతకీ ఈ సినిమా కథేంటి? అన్నది తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ:

బాగా సంపాదించి సొంత ఊరిలో స్థిరపడిన వ్యక్తి భుజంగరావు(ప్రకాష్ రాజ్), పరువుయే ప్రాణంగా బతుకుతుంటాడు, ఊర్లో అందరూ సలాం చేసేలా పనులు చేస్తుంటాడు, శివ (సత్య) అనే ఆటో డ్రైవర్ ని తన స్వంత పనులకి వాడుకుంటూ ఉంటాడు.

తెల్లారితే  శ్రీరామనవమి అనగా ఆ రోజు రాత్రి చిత్తుగా తాగుతాడు భుజంగం. ఆ మత్తులో ఓ వేశ్య (ప్రియమణి)ని చూసి మనసు పారేసుకొంటాడు. శివ సాయంతో వేశ్యని రప్పిచుకొని ఒక షాప్ లోకి వెళ్తాడు,ఈ వ్యవహారం బయటి జనానికి తెలిస్తే  పరువు పోతుందని కంగారు పడుతుంటాడు. అనుకోకుండా ఆ షెడ్డుకి తాళం వేసి వెళ్లిపోతాడు సత్య. గంటలో వస్తాడనుకొంటే ఓ చోట ఇరుక్కుపోతాడు. మరి.. ఆ గదిలోంచి వీరిద్దరూ బయటపడ్డారా?  భుజంగం భాగోతం వూరి జనానికి తెలిసిపోయిందా? ఆ ఒక్క సంఘటన వారి జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అన్న విషయాలు వెండితెర మీద చూడాల్సిందే.

అలజడి విశ్లేషణ:

ఈ చాలా సున్నితమైన కథ, ఇలాంటి కథతో కూడా సినిమా తియ్యడం అంటే చాలా దైర్యం ఉండాలి, ఏమాత్రం తేడా వచ్చిన ఎవరికీ అర్థం కాదు, మలయాళంలో ఆ ప్రయత్నం చేసిన దర్శకుడ్ని అభినందించాలి. దాన్నే తెలుగులో అనువదించే ప్రయత్నం చేశారు ప్రకాష్‌రాజ్‌. కథ మొత్తం నాలుగు పాత్రల చుట్టే ఉంటుంది.

సినిమాలో మనుషుల్లో ఉండే భాగోద్వేగాలు, మనసులో కలిగే సంఘర్షణలు ఎలా ఉంటాయో చూపించారు, సినిమా మొత్తం ఒకే గదిలో నడిచిపోతుంది, ప్రకాష్ రాజ్, ప్రియమణి మధ్యలో వచ్చే సన్నివేశాలు బాగున్నాయి, ఎటువంటి మాస్ , కమర్షియల్ అంశాలు లేకుండా కేవలం మనసుని తాకే విధంగా సినిమాని తీశారు.

సాంకేతిక వర్గం పనితీరు:

ఇయాళరాజ సంగీతం అనగానే ప్రేక్షకులు ఏవేవో ఊహించుకుంటారు ఆ స్థాయిలో మ్యూజిక్ లేదు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కెమెరా పనితనం చాలా బాగుంది, ఎడిటింగ్ మాత్రం ఘోరంగా ఉంది, దర్శకుడిగా తన గత చిత్రాలకంటే మెరుగైన పనితనమే  కనబరిచారు ప్రకాష్‌రాజ్‌.

ప్లస్ పాయింట్స్:

  • ప్రకాష్ రాజ్, ప్రియమణి
  • కథ

మైనస్ పాయింట్స్:

  • ఎడిటింగ్
  • సాగదీత
  • బోరింగ్ సీన్స్

అలజడి రేటింగ్: 2.5/ 5

పంచ్ లైన్: ఇది ‘మనలోని రామాయణం’

(Visited 1,531 times, 1 visits today)