Home / Entertainment / “మనం” మరోసారి అంటున్న నిన్నటి సూపర్ స్టార్..!

“మనం” మరోసారి అంటున్న నిన్నటి సూపర్ స్టార్..!

Author:

టాలీవుడ్ లో మరోసారి మనం తరహా ఫ్యామిలీ సినిమా రానుందా? ఔనననే అంటున్నాయి తాజా వార్తలు. ఈసారి ఘట్టమనేని వారింటి నుంచి ఈ సినిమా రాబోతున్నట్టు సమాచారం. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం టాలీవుడ్ పరిశ్రమలో ప్రముఖ రచయితగా పేరొందిన ఒక రచయిత ఈ మధ్య కృష్ణను కలిసి అక్కినేని కుటుంబ సినిమా ‘మనం’ స్థాయిలో ఉండే కథను వినిపించాడని టాక్. ఈ కథకు ఫిదా అయిపోయిన సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాను ‘మనం’ స్థాయిలో ఘట్టమనేని కుటుంబ సినిమాగా మార్చగల సమర్ధత ఉన్న దర్శకుడిని ని వెతికే పనిలో ఉన్నారట.

అంతేకాదు ఈసినిమాను ఎట్టి పరిస్తుతులలోను వచ్చే సంవత్సరం మొదలు పెట్టి విడుదల కూడా చేసేద్దాం అనుకుంటున్నారట. ఈ మేరకు కృష్ణ  తన తనయుడు ప్రిన్స్ మహేష్ పై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. ఐతే ఈ సినిమా మహేష్ కి ఒక తలనొప్పిని తెచ్చేలా ఉంది.ప్రస్తుతం తాను ఒప్పుకున్న సినిమాలకు డేట్స్ ఎలా సర్దుబాటు చేయాలో అర్ధంకాని పరిస్థితుల్లో ఉన్న మహేష్ బాబు కి మధ్యలో వచ్చిన ఈ ఘట్టమనేని ఫ్యామిలీ సినిమా ప్రస్తావన కాస్త ఇబ్బంది కలిగించటమే కాకుండా ఈ ప్రాజెక్ట్ విషయంలో ఆచితూచి వ్యవహరిద్దామని తన తండ్రికి నచ్చ చెపుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అక్కినేని ఫ్యామిలీ సినిమా “మనం” ఇంకా ఫ్రెష్ గానే ఉండటం తో కొన్నాళ్ళు ఆగి ఈ ఘట్టమనేని సినిమా మొదలు పెడదాం అన్నాడాడట మహేష్.

సూపర్ స్టార్ కృష్ణతో పాటు రమేష్ బాబు, మహేష్ కుమారుడైన గౌతమ్ లకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ తయారు చేయబడ్డ ఈ ఘట్టమనేని ఫ్యామిలీ మూవీ కథ కృష్ణ ఒకే చేసిన నేపధ్యంలో మహేష్ ఎలాంటి నిర్ణయం తీసుకొనున్నారు అనేది ఆసక్తి కరంగా మారింది. తన తండ్రి ఒత్తిడికి తల ఒగ్గి మహేష్ ఈ కుటుంబ సినిమాను చేస్తాడా? లేదంటే ఎదో వంకతో తాత్కాలికంగా ఈ ఫ్యామిలీ ప్రాజెక్ట్ ను వాయిదా వేస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది..

 

(Visited 36 times, 1 visits today)