Home / Inspiring Stories / రైలులో సాధారణ బోగీలో ఉన్న ఆయన గోవా ముఖ్యమంత్రి అంటే నమ్మగలరా..!

రైలులో సాధారణ బోగీలో ఉన్న ఆయన గోవా ముఖ్యమంత్రి అంటే నమ్మగలరా..!

Author:

రాజకీయ నాయకుల హంగు, ఆర్భాటాలు మామూలుగానే అధిక స్థాయిలో ఉంటాయి, అదే ఏదైనా పదవిలో ఉంటే వాళ్ళని ఆపడం ఎవరి తరం కాదు..వార్డు మెంబర్ అయితే చాలు, డాంబికాలు పోతూ, దర్జాలు వెలగబెడుతూ, టెక్కులనిక్కుడు వేషాలేస్తూ…. ఎక్కడ ఎంత సంపాదించాలంటూ నానా అవలక్షణాలకు దిగే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు, కానీ రెండు సార్లు గోవాకి ముఖ్యమంత్రిగా ,కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పనిచేసి ప్రస్తుతం మూడో పర్యాయం గోవా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న మనోహర్ పారికర్ నిరాండంబరత గురుంచి తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు.

ఓ పేద కుటుంబం నుంచి ఎదిగి, ఐఐటీ బొంబాయిలో చదివి, రాజకీయాల్లో ఉన్నత స్తనాలకి చేరినా అయన ఏమాత్రం మారలేదు అంటారు ఆయన గురుంచి తెలిసినవాళ్లు…అంత పెద్ద పదవులలో ఉండి కూడా అత్యంత సాధారణ జీవితం గడుపుతూ ఉండే మనోహర్ పారికర్ ని చూస్తే ఈ కాలంలో కూడా ఎలాంటి హంగు. ఆర్భాటాలకు పోనీ నాయకులూ ఉన్నారా..అని ఆశ్చర్యపోతాం.. ఇప్పటికే అనేక సార్లు మనోహర్ పారికర్ నిరాంబండరాత గురుంచి వార్తల్లో వచ్చింది, ఇప్పుడు మరోసారి పారికర్ ఆ విషయంలోనే వార్తల్లో నిలిచాడు..అదేమిటంటే..

మనోహర్ పారికర్

మనోహర్ పారికర్ గోవాలోని మడగావ్ నుంచి 145 కిలోమీటర్ల దూరంలో కర్నాటకలోని కుంట పట్టణానికి ఓ ఫంక్షన్‌కు వెళ్లాల్సి ఉంది… లాస్ట్ సండే… సీఎం కదా, అధికారులు జబల్‌పూర్- కోయంబత్తూర్ స్లీపర్ క్లాస్ ముందే బుక్ చేశారు… సరే, ఈయన సమయానికి వెళ్లాడు రైల్వే స్టేషన్‌కు… కానీ ఆ రైలేమో మరీ లేటు అని అధికారులు చెప్పారు… వోకే, ఇప్పుడు ఆవైపు వెళ్లే వేరే ట్రైన్ ఏముందీ అనడిగితే, ఓ మంగళూరు ప్యాసింజర్ ఉందీ అని చెప్పారు అక్కడి రైల్వే అధికారులు… అంతే, వెంటనే ఆ రైలుకు టికెట్టు తీసుకుని, ఓ సాధారణ ప్యాసింజరులాగా ఓ బోగీలోని ప్యాసింజర్ల నడుమకు వెళ్లి కూర్చున్నాడు… సార్, సార్… ఓ స్పెషల్ బోగీ అటాచ్ చేస్తాం, మీరు ప్రత్యేకంగా వెళ్లొచ్చు అని రైల్వే అధికారులు చెప్పినా సరే, తను అంగీకరించలేదు… ఆ తంతు తనకు ఇష్టం లేకపోవడం, ఆ తంతు పూర్తయ్యే సరికి ఈ ప్యాసింజరూ లేటై ప్రయాణికులు ఇబ్బంది పడతారని భావించడం కారణాలు… ఆఫ్టరాల్ 145 కిలోమీటర్లే కదా, కాన్వాయ్‌లో ఝామ్మని బయల్దేరితే గంటన్నర సేపట్లో వెళ్లొచ్చు… కానీ ఆ ఫంక్షన్‌కు అట్టహాసంతో వెళ్లడం తనకు ఇష్టం లేదు… గోవా సీఎంగా, మాజీ రక్షణ మంత్రిగా గాకుండా… కేవలం ఓ మనోహర్ పరీకర్‌లా వెళ్లాలనుకున్నాడు… అదీ సంగతి… తేడా ఏమిటో మీకు అర్థమయ్యే ఉంటుందిగా…!

పారికర్ నిరాంబండరాత గురుంచి మరికొన్ని ఉదాహరణలు…

  • ట్రాఫిక్ సిగ్నల్ పడింది… వేగంగా ఓ కారు వచ్చి ఆగింది… దానికన్నా ముందు ఓ స్కూటరుంది… కారులో కూర్చున్న వ్యక్తి అదేపనిగా హారన్ కొడుతూ దారి ఇవ్వమని అడిగాడు… ఆ స్కూటరిస్టు సైలెంట్‌గా రెడ్ సిగ్నల్ చూపించాడు… నాకు తెలుసులేవోయ్, నేను గోవా పోలీసాఫీసర్ కొడుకుని అన్నాడు కారతను… అవునా, నేను గోవా ముఖ్యమంత్రిని అన్నాడు స్కూటరిస్టు చిన్నగా నవ్వుతూ…. ఆ స్కూటరిస్టు పేరు పరీకర్… పూర్తి పేరు మనోహర్ గోపాలకృష్ణ ప్రభు పరీకర్…

manohar-parikhar

  • ఓ అబ్బాయి పూణెలో బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ఓ చిన్న హోటల్ లో కూర్చుని పేపర్ చదువుతుంటాడు… ఈలోపు ఒకాయన మెల్లిగా లోపలికి వచ్చి ఓ వడపావ్ ఆర్డరిస్తాడు… ఈ అబ్బాయికి ఎదురుగా కూర్చుని, అది తనేసి వెళ్లిపోతాడు… ఎక్కడో చూసినట్టుందే అనుకుంటూ రహస్యంగా ఫోటో తీస్తాడు… తర్వాత ఫ్రెండ్స్ కు చూపిస్తే అతడు దేశ రక్షణ మంత్రి పరీకర్ అని చెబుతారు… ఏదో ప్రైవేటు పనిపై పూణె వెళ్తే, అక్కడ అంత సాదాసీదాగా వ్యవహరించాడు ఆయన… అది ఆయన నైజం… ఆ అబ్బాయి ఆశ్చర్యంతో ఇది నమ్మశక్యమేనా అంటూ పోస్టింగ్ పెడతాడు… గోవాలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కూటర్ పై అసెంబ్లీకి వెళ్లిన రోజులు అనేకం… ప్రొటోకాల్ ఏమీ పట్టించుకోడు… పోలీస్ కేసుల్లో జోక్యం చేసుకోడు… ట్రాఫిక్ జామ్ అయిందనుకొండి… కారు దిగేస్తాడు… పక్కనే ఉన్న స్కూటరిస్టును లిఫ్ట్ అడిగి వెళ్లిపోతాడు… మధ్యలో ఆగేసి బడ్డీ కొట్టులో టీ తాగుతాడు… కొన్నిసార్లు ఫుట్ పాత్ పై అమ్మే బజ్జీలు తింటూ, వాళ్లనూ వీళ్లనూ ఏం జరుగుతున్నదంటూ ఆరాలు తీస్తాడు… గోవా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ కాన్ఫరెన్స్‌కు ఇలాగే వెళ్లాడు… సింపుల్‌గా తన కారు దిగేసి ఫైళ్లు తీసుకుని లోపలకు వెళ్లాడు.., ఈలోపు సీఎం సెక్యూరిటీ అక్కడికి చేరుకుంది, నిర్వాహకులు ‘ఏడీ మీ ముఖ్యమంత్రి’ అనడిగితే… అదుగో వెళ్తున్నాడు కదా ఆయనే మా సీఎం అన్నారుట సెక్యూరిటీ సిబ్బంది… సో, ఇప్పటికీ ఆయన మారలేదు అని చెప్పటానికి పైన మనం చెప్పుకున్న రైలు ప్యాసింజరు ప్రయాణం తాజా ఉదాహరణ…

Source: Muchata.com

(Visited 128 times, 1 visits today)