మంచు ఫ్యామిలి రూట్ ఏ సేపరేటు.. ఎందుకో తెలుసా.? సోషల్ మీడియా లో వారి మీద పడినన్ని ట్రోల్స్ ఇంకెవరి మీద పడి ఉండవు.
Damnnnn :
ఈ పదం వింటే అందరికీ మంచు విష్ణు నే గుర్తు వస్తాడు. ఒక ఆడియో ఫంక్షన్ లో తను వాడిన ఈ పదం ఎంత ఫేమస్ అయ్యింది అంటే, ఐ వాస్ లైక్ Damnnn తెలుగు అనే పేజీ ని క్రీఎట్ చేసి ఫుల్ పాపులర్ చేశారు. ఇక్కడ మొదలైన మంచు ఫ్యామిలీ ప్రస్తావన, కొంత కాలం వెనక్కి వెళ్లి మోహన్ బాబు గారు చెప్పిన అయ్యప్ప స్వామి సాక్షిగా డైలాగ్ నుంచి మొదలెట్టారు మళ్ళీ.
R హాస్ టూ రోల్ :
అవార్డ్స్స్ ఫంక్షన్ లో లక్ష్మీ మంచు చెప్పిన ఈ డైలాగ్ తో సోషల్ మీడియా లో అందరూ మంచు అక్కని ఆడుకొనుడు స్టార్ట్ చేశారు. ఇంక ఆ తరువాత నుండి అక్క ఏదో ఒక స్టఫ్ అందిస్తూనే ఉంది సోషల్ మీడియా వాళ్లకు. ఇటీవలే Niladisfy అని ఒక మాట అనడం తో, తిరిగి అందరూ మంచు అక్క అనిన మాట ను ట్రోల్ చెయ్యడం స్టార్ట్ చేసారు.
ఓన్లీ వన్స్ ఫాసక్ (FASAKK) :
మోహన్ బాబు గారు నేషనల్ మీడియా ఛానెల్ లో ఒక ఇంటర్వ్యూ లో తెలుగు డైలాగ్ ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పినప్పుడు సోషల్ మీడియా అంతా ఆయన ఫాసక్ డైలాగు ని ప్రతి దానికీ లింక్ చేసి వాడారు, ఇప్పటికీ వాడుతున్నారు. అంతలా ఫేమస్ అయ్యింది ఆ డైలాగ్.
మంచు మనోజ్ అన్నా :
ట్విట్టర్ లో ఒక ఫ్యాన్ మంచు మనోజ్ అన్న ని ట్యాగ్ చేసి, అన్నా నువ్వొక్కడివే బ్యాలన్స్, అందరూ ఏదో ఒక దాంతో ఫేమస్ అయ్యారు అని ట్వీట్ చేసాడు, ఆ ట్వీట్ కి రిప్లై ఇస్తూ మంచు మనోజ్ – “కొంచెం కష్టమే కానీ ప్రయత్నిస్తా బ్రదర్, ఇప్పటికి దీంతో సర్దుకు పోండి, లైఫ్ ఇస్ ఎ డ్రామా కానీ మీరంటే నాకు ప్రేమ” అని రిప్లై ఇచ్చాడు మంచు మనోజ్.
మంచు ఫ్యామిలీ ట్రోల్స్ ని కూడా ఇంత స్పోర్టివ్ వే లో తీసుకుంటున్నారు అంటే, అది వారి గొప్పతనం.