సెప్టెంబర్ 11 ప్రపంచం వణికిపోయే రోజు ముఖ్యంగా అమెరికా పౌరులలో మనసుల్లో దురదృష్ట సంఖ్య 13 కంటే కూడా భ్యంకరమైన నంబర్ గా 11 గుతుండి పోయింది. ఇప్పటికీ సెప్టెంబర్ 11 వస్తూందంతే అమెరికన్లు ఉలిక్కిపడ్తారు. కారణం అందరికీ తెల్సిందే, అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ అమెరికాపై ‘విమాన బాంబు దాడులతో’ విరుచుకుపడిన రోజు సెప్టెంబర్ 11.
2001, సెప్టెంబర్ 11న అమెరికాలో తీవ్రవాదుల దాడి జరిగిందన్న వార్త. అప్పట్లో ప్రపంచాన్ని అట్టుడికించింది.
అమెరికన్ లతో సహా ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందినవారు మొత్తం 2996 మంది ఈ దాడిలో అక్కడికక్కడే చనిపోయారు. ఇందులో పదిహేను మందికి పైగా తీవ్రవాదులూ వున్నారు. అప్పటిదాకా విమానాల్లో వచ్చి తీవ్రవాదులు దాడి చేయగలరన్న విషయం ఏవరు ఊహించనిది. ప్రపంచ చరిత్రలోనే ఈ స్థాయిలో విమానాలతో ఉగ్రదాడి జరగడం ఇదే ప్రథమం.
డబ్ల్యుటిసీ జంట భవంతులూ, అమెరికా రక్షణ స్థావరమైన పెంటగాన్ తీవ్రవాదుల దాడులతో దారుణంగా ధ్వంసమయ్యాయి. పెంటగాన్ పాక్షికంగానే అయినా జరిగిన నష్టం మాత్రం తక్కువేమీ కాదు.
యునైటెడ్ స్టేట్ క్యాపిటాల్‌ని టార్గెట్ చేసిన విమానం మరో చోట కుప్పకూలిపోయింది. పెంటగాన్, డబ్ల్యూటీసీపైన టార్గెట్ చేసిన విమానాలు
మాత్రం, ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించాయి. ఈ ఘటన కు కారణం అంటూ ఒసామా బిన్ లాడెన్ తెర మీదికి వచ్చాడు.
పెద్దయెత్తున జరిగిన మరణాలు ఒకేత్తైతే, అమెరికా ఆర్థిక వ్యవస్త కుప్పకూలటం ,రక్షణ వ్యవస్త లోని లోపాలు బయట పడటం తో అమెరికా ఒక్కటే కాదు యావత్ నిజంగానే నివ్వెరపోయింది.
ఈ విద్వంసం ఒక ఎత్తైతే 9/11 కి ప్రతీకారం గా లాడెన్ కోసం అమెరికా మొదలు పెట్టిన ఆఫ్గాన్ యుద్దం 4,00,000 కు పైగా ప్రాణాలని బలికొంది. కానీ మూల కారణమైన లాడెన్ మాత్రం పట్టు బడలేదు.
2011 మేయ్ 2 న ఒసామా ఆచూకీ కని పెట్టిన అమెరికా పాకిస్తాన్ లో ని అబోతాబాద్లో ఒక ఇంట్లో తల దాచుకున్న ఒసామాని పట్టుకొని హతమార్చింది.
ఐతే తీవ్రవాదం 2001/9/11కు ముందూ వుంది 2011 తర్వాతా ఇప్పుడూ వుంది. ప్రపంచ దేశాలు ఇంకా ఉగ్రవాదంతో పోరాడుతూనే వున్నాయి. ఉగ్రవాదం మానవాళికి ఎప్పటికప్పుడు కొత్తగా సవాల్ విసురుతూనే వుంది. అప్పుడు అల్ ఖైదా. ఇప్పుడు ఐసిస్ ఉగ్రవాదపు పేరు మారొచ్చు తీరు మారలేదు..
ఐతే ఉగ్రవాదం అంటే ఒక్క తుపాకీ పట్టుకున్న తిరుగు బాటు దారునిదేనా..!? రాజ్య కాంక్ష,పెట్రో బావుల స్వాదీనం, ఆయుధల విక్రయం కోసం ఇంకా ఎన్నొ రకాలుగా మనుషులని బలిగొంటున్న ఉగ్రవాదం ఎప్పుడు ఆగుతుందీ..!? అంటే సమాధానం తెలిసినా బయటకు రాదు