Home / Political / సాంకేతికతను దొంగిలించిన కేసులో కోర్ట్ కి హాజరుకానున్న జుకర్ బర్గ్.

సాంకేతికతను దొంగిలించిన కేసులో కోర్ట్ కి హాజరుకానున్న జుకర్ బర్గ్.

Author:

ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. చిన్న వయసులోనే ఫేస్‌బుక్‌ ని స్థాపించి అనతికాలంలోనే కోటీశ్వరడు అయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల మందికి ఫేస్‌బుక్‌ ఖాతాలు ఉన్నాయి. ఫేస్‌బుక్‌ సంస్థ 2014 లో ఓకులస్ అనే సంస్థ ను 200 కోట్ల డాలరలకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ ఓకులస్ సంస్థ తయారు చేసే వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్ ల వలనే ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ కోర్టుకు హాజరు కావాల్సి వస్తుంది. ఫేస్‌బుక్‌, ఓకులస్ లు కలిసి తమ వర్చువల్ రియాలిటీ సాంకేతికతను దొంగిలించారని జెనిమాక్స్ మీడియా అనే సంస్థ కోర్టులో కేసు వేసింది. అసలు వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్ తయారుచేసే సాంకేతికతను తామే అభివృద్ది చేసామని దానిని అక్రమంగా వాడుకున్నందుకు ఫేస్‌బుక్‌ తమకు $2 బిలియన్లు (£1.6 బిలియన్లు) నష్టపరిహారంగా చెల్లించాలని కోర్టుకి తెలియజేసింది జెనిమాక్స్ మీడియా. ఈ కేసులో తమ వాదనలు వినిపించడానికి ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ జనవరి 17 న డల్లాస్ కోర్టుకు రానున్నారు. ఈ కేసులో ఫేస్‌బుక్‌ ది తప్పని తేలితే 200 కోట్ల అమెరికన్ డాలర్లు ఫేస్‌బుక్‌ సంస్థ జెనిమాక్స్ మీడియాకు కట్టాల్సి ఉంటుంది.

Mark Zuckerberg in court

అయితే ఈ కేసు విశయంలో ఫేస్‌బుక్‌ మరియు ఓకులస్ సంస్థలు తాము ఏ తప్పు చేయలేదని వాధించనున్నాయి. వర్చువల్ రియాలిటీ సాంకేతికతపై తాము కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి సొంతంగా వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్ లు తయారు చేసుకున్నామని ఇంతకుముందే ప్రకటించాయి. కేవలం జెనిమాక్స్ సంస్థ నుండి ఒక ఉద్యోగి తమ సంస్థలో జాయిన్ అయినందుకే వాళ్ళు ఈ కేసు పెట్టారని తెలిపింది. చూడాలి ఈ కేసులో ఎటువంటి తీర్పు వస్తుందో?

(Visited 779 times, 1 visits today)