Home / Reviews / ఎంసీఏ సినిమా రివ్యూ & రేటింగ్.

ఎంసీఏ సినిమా రివ్యూ & రేటింగ్.

MCA రివ్యూ నాని సాయి పల్లవి ఎంసీఏ

Alajadi Rating

2/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: నాని - సాయి పల్లవి - భూమిక - విజయ్ వర్మ - రాజీవ్ కనకాల - నరేష్ - ఆమని - ప్రియదర్శి - రచ్చ రవి - పవిత్ర లోకేష్ - శుభలేఖ సుధాకర్ తదితరులు

Directed by: వేణు శ్రీరామ్

Produced by: దిల్ రాజు - శిరీష్ - లక్ష్మణ్

Banner: శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్

Music Composed by: దేవిశ్రీ ప్రసాద్

అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయి అభిమానుల చేత న్యాచురల్ స్టార్ అనిపించుకుంటున్న నాని..ఈ సంవత్సరం ఇప్పటికే రెండు హిట్లు కొట్టేసి..వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా తీసిన సినిమా ‘ఎంసీఏ’ ..మిడిల్ క్లాస్ అబ్బాయ్ అంటూ ఈరోజు మన ముందుకు వచ్చాడు..మరి నాని హిట్ మరోసారి హిట్టు కొట్టాడా లేదా..తెలుసుకోండి.

కథ:

నాని (నాని) ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, చిన్నప్పుడే అమ్మానాన్నలను కోల్పోయిన నానిని తన అన్నయ్య (రాజీవ్ కనకాల) అన్ని తానై పెంచుతాడు, రాజీవ్ ని పెళ్లిచేసుకొని జ్యోతి (భూమిక) నానికి వదినగా ఆ ఇంట్లోకి వస్తుంది, ఉద్యోగరీత్యా జ్యోతి వేరే ఊరికి వెళ్లాల్సి రావడంతో నాని తోడుగా వెళ్తాడు, అక్కడ వీళ్ళకి ఎదురైనా సమస్యలు ఏంటి..? పల్లవి (సాయి పల్లవి) నానికి సంబంధం ఏంటి..? ఆ సమస్యల నుండి ఎలా బయటపడ్డారు..? అనేది మిగిలిన కథ.

అలజడి విశ్లేషణ:

నాని సినిమాలో ఉంటే చాలు మాములు కథ అయిన సరే తన స్టైల్ లో, తన న్యాచురల్ పెర్ఫార్మన్స్ తో సినిమాని హిట్ చేసేస్తాడు అనే పాయింట్ ని నమ్ముకొని ఈ సినిమాని తీసినట్లుగా ఫస్ట్ ఆఫ్ లోనే తెలిసిపోతుంది, అసలే మిడిల్ క్లాస్ క్యారెక్టర్..అలాంటి క్యారెక్టర్ లో నాని అంటే ఖచ్చితంగా ఇరగదీస్తాడు…ఫస్ట్ ఆఫ్ మొత్తం ఫుల్ ఎంటర్టైన్ చేసేసాడు, నాని, భూమిక, సాయి పల్లవి మధ్యలో వచ్చే సీన్లుతో ఇంటర్వెల్ ముందు ఎలాంటి బోర్ కొట్టకుండా సినిమా నడిచిపోతుంది.

ఇంటర్వెల్ తరువాత నుండే సినిమా రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోతుంది, కొత్త కథ ఆశించి సినిమాకి వచ్చిన ప్రేక్షకులకి ఈ రొటీన్ స్టోరీతో విసిగిపోతారు, ఏ కొత్తదనం లేకుండా.. ఏ మలుపులూ లేకుండా.. ఫ్లాట్ గా సాగిపోయే ద్వితీయార్ధం ‘ఎంసీఏ’కు పెద్ద మైనస్ అయిపోయింది. కొంచెం అవకాశమున్నా చెలరేగిపోయే నానికి కూడా.. రెండో అర్ధంలో చేతులు కట్టేసినట్లు అయిపోయాడు. అక్కడక్కడా నాని ‘ఎంసీఏ’ను కొంచెం పైకి లేపే ప్రయత్నం చేసినా..కథలో కంటెంట్ లేకపోవడం వల్ల పెద్దగా ఫలితం లేకపోయింది.

ఫస్ట్ ఆఫ్ మొత్తం నాని చేసే అల్లరితో సరదాగా సాగిపోయిన..సెకండ్ ఆఫ్ మాత్రం ఏమాత్రం ఎంటెర్టైనింగ్ గా లేకుండా ఉండటంతో ప్రేక్షకులు మధ్యలోనే మిడిల్ డ్రాప్ అయిపోతారు, కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పటికీ అవి రొటీన్ అయిపోయాయి, చివరగా ఫస్ట్ ఆఫ్ ఎంటెర్టైనింగ్ గా..సెకండ్ ఆఫ్ రొటీన్ గా..ఎంసీఏ..!

నటీనటుల పెర్ఫార్మన్స్:

నాని: నాని గురుంచి చెప్పేది ఏముంది..చాలా ఈజీగా నటించి మెప్పించేసాడు..!మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్రను అలవోకగా చేసుకెళ్లిపోయాడు.

సాయి పల్లవి: సాయి పల్లవి బాగానే చేసినప్పటికీ..ఈ సినిమాలో ఆమె పాత్రకి ఎక్కువ స్కోప్ లేదు..

భూమిక: పరిణతితో కూడిన నటనతో హీరో వదిన పాత్రను రక్తి కట్టించింది. భూమిక నటన సినిమాకు బలంగా నిలిచింది.

రాజీవ్ కనకాల, ప్రియదర్శి, విజయ్ వర్మ, నరేష్, ఆమని..తదితరులు..బాగానే చేసారు..!

ప్లస్ పాయింట్స్ :

నాని, భూమిక ల నటన
మ్యూజిక్

మైనస్ పాయింట్స్: 

కథ, స్క్రీన్ ప్లే
సెకండ్ ఆఫ్

పంచ్ లైన్: ఏమండోయ్ నాని గారు..సినిమా రొటీన్ అండి..!

(Visited 606 times, 1 visits today)