Home / Latest Alajadi / ఆహరం లేకున్నా ఆ చిన్నారులు 9 రోజులో గుహలో ఎలా బతికారంటే…!

ఆహరం లేకున్నా ఆ చిన్నారులు 9 రోజులో గుహలో ఎలా బతికారంటే…!

Author:

సరదాకి గుహని చూద్దాం అని వెళ్లిన వారు ఆకస్మిక వర్షాలతో గుహ లోపల చిక్కుకొని తొమ్మిది రోజులు ఎలా బతికారనేది ఆసక్తికరంగా మారింది.జూన్ 22న గుహలో చిక్కుకుపోయిన చిన్నారులను 9 రోజుల అనంతరం బ్రిటిష్ డైవర్లు గుర్తించారు. అసలు అంతవరకూ ఆ చిన్నారులు ఎలా బతికి ఉన్నారనేది మిస్టరీగా మారింది. డైవర్లే కాదు ప్రపంచంలో ఎవ్వరూ ఆ చిన్నారులు బతికే ఉన్నారంటే నమ్మలేదు. అయితే ఈ అండర్ 16 ఫుట్‌బాల్ టీమ్ కోచ్ ఎకపోల్ చంటవోంగ్ చిన్నారులను కాపాడారు. తొమ్మిది రోజులు తిండితిప్పలు లేకున్నా చిన్నారులు ప్రాణాలు నిలుపుకోగలిగేలా కోచ్ ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ధ్యానం నేర్పించారు. ధ్యానం ద్వారా శక్తిని పొందేలా శిక్షణ ఇచ్చారు. చిన్నారులకు ధైర్యం నూరిపోశారు. స్థైర్యం నింపారు. పూర్వాశ్రమంలో బౌద్ధ సన్యాసిగా ఉన్న ఎకపోల్‌కు ధ్యాన ప్రక్రియలపై పట్టుంది. ప్రతికూల పరిస్థితుల్లో ధ్యానం చేస్తే కలిగే ప్రయోజనాలు తెలిసినవాడు కావడంతో చిన్నారులకు ఆ కిటుకులు నేర్పారు. అనాథ అయిన ఎకపోల్ అలాగే పెరిగి సమాజసేవలో తరించారు. ఈ క్రమంలో 25 ఏళ్లకే అండర్ 16 ఫుట్‌బాల్ టీమ్ కోచ్ స్థాయికి ఎదిగారు.

గత నెల 22న గుహ చూసేందుకు ఎకపోల్‌తో పాటు వెళ్లిన 12 మంది చిన్నారులు ఆకస్మిక వరదలు రావడంతో అక్కడే చిక్కుకుపోయారు. గుహ బయటకి వెళ్లే దారి నుండి భారీగా వరద నీరు వస్తుండటంతో చిన్నారులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు గుహ లోపలకి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఎత్తైన చోటకు చేరుకుని కూర్చున్నారు. గుహ బయట పార్క్ చేసి ఉన్న సైకిళ్లు, వారి బ్యాగుల ఆధారంగా చిన్నారులు లోపల చిక్కుకుపోయారని వారు తప్పిపోయిన 9 రోజుల తరువాత గుర్తించిన అధికారులు నిపుణులైన డైవర్ల సాయంతో థాయ్‌లాండ్ డైవర్లు వెతకడం ప్రారంభించి ఎట్టకేలకూ చిన్నారులను, వారి కోచ్‌ను గుర్తించారు. అయితే 9 రోజులైనా చిన్నారులు ఎలా బతికి బట్టకట్టారనేది వారికి కూడా అంతు చిక్కలేదు. నిజానికి డైవర్లు చిన్నారుల వద్దకు చేరుకున్న సమయంలో వారంతా పూర్తి ధ్యానంలో ఉన్నారు. ధ్యానం ద్వారా శక్తి సంపాదించుకోవచ్చని కోచ్ ఇచ్చిన శిక్షణ ద్వారానే చిన్నారులు ప్రాణాలు దక్కించుకోగలిగారని డైవర్లు గుర్తించారు. ఆ తర్వాత థాయ్ నేవీ పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఈ నెల 8, 9, 10 తేదీల్లో అందరినీ కాపాడారు. అయితే చిన్నారులను తొమ్మిదిరోజుల పాటు ప్రాణాలతో నిలిపి ఉంచగలిగిన ఎకపోల్‌‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

(Visited 1 times, 1 visits today)