Home / Inspiring Stories / మీరు చెప్పే డిజిటల్ ఇండియా ఎలా సాధ్యం?

మీరు చెప్పే డిజిటల్ ఇండియా ఎలా సాధ్యం?

Author:

అద్బుతమైన ప్రసంగంతో సభికులని కట్టిపడేసే వక్త మన ప్రధాని మోడీ అని మనందరికీ తెలుసు. అనేక అంతర్జాతీయ వేదికల మీద సభికులను మంత్రముగ్ధుల్ని చేసిన మోడీ ఒక స్కూలు పిల్ల వాడు అడిగిన  ప్రశ్నకు కంగారు పడిపోయారు. ఆకంగారులో చెప్పాల్సింది వదిలెసి మరేదో మాట్లాడారు.ఆ పిల్ల వాడి ప్రశ్న తో మోడీ కొత్త హమీలు కూడా ఇచ్చారు ఇంతకూ ఆ కుర్రాడు ఎం అడిగాడు?ఒక దేశ ప్రధాని నే తడబడేంతలా ఏం ఉంది? ఇలాంటి చిత్రమైన అనుభవం తో మోడీ ఎలా ఫీలయ్యారు?  ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ఢిల్లీలోనే పిల్లల్తో ఒక సమావేశం ఏర్పాటుచేసుకున్నారు. ఇలాంటి సమావేశాలను ప్లాన్‌ చేసుకున్నప్పుడు. దేశానికి మొత్తంగా స్ఫూర్తి దాయకంగా కనిపించే ఉపన్యాసాలు దంచేయటం ఎప్పుడూ ఉండేదే. అదే సాంప్రదాయాన్ని పాటిస్తూ అలవాటు ప్రకారమే “డిజిటల్‌ ఇండియా” దాని వల్ల లాభాలూ అంటూ పిల్లల ముందు మాటలు ప్రారంభించారు.

ఐతే ప్రధాని ప్రసంగం మొదలైన కాసేపటికే ఓ స్కూలు కుర్రాడు లేచి. ఈదేశంలో సగం ప్రాంతాల్లో ఇప్పటికీ కరెంటే లేదు కదా మరి మీరంటున్న డిజిటల్‌ ఇండియా ఎలా సాధ్యం అవుతుంది? అని ప్రశ్నించడంతో కొన్ని క్షణాలు అవాక్కయ్యారు మోడీ. ఆయన ప్రసంగం ఏం ప్రిపేర్‌ అయి వచ్చారో గానీ ఇప్పూడు ఇక ఆ పిల్లవాడికి చెప్పే సమాధానమే ప్రసంగం అయ్యింది ఆ పిల్లాడి పుణ్యమాని ఈ దేశానికి విద్యుత్తు సదుపాయం గురించి డెడ్‌లైన్‌ సహా కొత్త హామీలు ఇవ్వాల్సి వచ్చింది.

ఆ కుర్రవాడు ఊహించని విధంగా అలా ప్రశ్నించే సరికి తొలుత మాటలు తడుముకున్న ప్రధాని. తర్వాత విద్యుత్తు సమస్య గురించి తన అవగాహన ప్రదర్శించారు. ఈ దేశంలో వెయ్యి రోజుల్లో ప్రతి గ్రామానికి కరెంటు ఇచ్చేస్తాం అంటూ కొత్త హామీ గుప్పించారు. పిల్లాడి ప్రశ్న కలిగించిన కంగారును కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఇంత భారీ హామీ ఇవ్వాల్సి వచ్చింది. నిజానికి అ పిల్లవడికి తానడికే ప్రశ్న ఇంతటి మార్పుకు కారణమౌతుందనీ, ప్రభుత్వాలకే సవాల్ గా నిలిచి ముఖ్యమైన సమస్యని తాను ముందుకు తెచ్చాననీ కూడా ఆ సమయం లో తెలిసి ఉండి ఉండదు…

(Visited 92 times, 1 visits today)