Home / Entertainment / Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!

Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!

Author:

ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ పేరు ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. తెలిసే అవకాశం కూడా లేదు. కనీసం ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా ఆ పిల్ల సంగతి జనాలకు ఎలా తెలుస్తుంది చెప్పండి? కానీ ఇప్పుడీ పేరుతో ఇంటర్నెట్ లో జనాలు తెగ సెర్చ్ చేసి పారేస్తున్నారు, అందుకు కారణం ఒక వీడియోలో ఆ అమ్మాయి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్.

ప్రియా ప్రకాష్

ఒరు అడార్ లవ్ (Oru Adaar Love) పేరుతో మలయాళంలో హైస్కూల్ లవ్ నేపథ్యంలో వస్తున్న సినిమాలో ప్రియా ప్రకాష్ నటిస్తుంది, వాలంటైన్స్ డే సందర్భంగా ఒక వీడియో సాంగ్ ని విడుడల చేసారు, ఆ పాటలో ప్రియా ప్రకాష్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కి అందరు ఫిదా అయిపోయారు, ప్రియా ప్రకాష్ కోసం ఆ పాటని మళ్ళీ మళ్ళీ చూసేస్తున్నారు, దెబ్బకి ఆ పాట యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది, ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ప్రియా ప్రకాష్ ఎక్స్ప్రెషన్స్ గురుంచే మాట్లాడుకుంటున్నారు, ప్రియా ప్రకాష్ కి Crush Of India అనే బిరుదు కూడా ఇచ్చేసారు. ఆ వీడియో సాంగ్ మీరు కూడా చూసేయండి.

(Visited 1,046 times, 1 visits today)