Home / Entertainment / ‘మీటూ’ : లైంగిక వేధింపుల గురించి బయటపెడుతున్న నటీమణులు, గాయనీలు.

‘మీటూ’ : లైంగిక వేధింపుల గురించి బయటపెడుతున్న నటీమణులు, గాయనీలు.

Author:

‘మీటూ’ పేరిట తాము ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి బయటపెడుతున్న నటీమణులు, గాయనీలు.

చిన్మయికి మద్దతుగా నిలబడిన సమంత

Meetoo campaign Actresses and singers who are outlawed about sexual abuse.

కాస్టింగ్ కౌచ్ వేధింపులపై పోరాటం మీ టూలో భాగంగా ప్రముఖ సింగర్ చిన్మయి రచయిత వైరముత్తుపై ఆరోపణలు చేయడం ఆయన వాటిని ఖండించడం, మళ్ళీ చిన్మయి వైరముత్తు అబద్దం ఆడుతున్నడని అనడం తెలిసిందే. ఎలాంటి ఆధారాలు లేకుండా వైరముత్తుపై ఆరోపణలు చేయడం నచ్చని కొందరు చిన్మయిని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో మొదటి నుండి చిన్మయిని సపోర్ట్ చేస్తున్న ఆమె స్నేహితురాలు సమంత ఈరోజు కూడ ఆమె తరపునే నిలబడి నువ్వు, రాహుల్ రవీంద్ర నాకు గత పదేళ్లుగా తెలుసు. మీకన్నా మంచి వ్యక్తులు నాకు మరొకరు తెలీదు. మీరు చెప్పేదాంట్లో నిజముంది అంటూ ట్వీట్ చేసి తన మద్దతు తెలిపింది.

దర్శకుడి చెంప చెళ్లుమనిపించింది

తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన దర్శకుడి చెంప ఆయన భార్య ఎదుటే పగలగొట్టింది ఓ నటి. బాలీవుడ్ దర్శకుడు సుభాష్ కపూర్‌కు ఎడమ చేయి లేదు అయినప్పటికీ మంచి కాన్సెప్ట్ బేస్‌డ్ సినిమాలు తీస్తారని మంచి పేరుంది. బాలీవుడ్‌లో వచ్చిన ‘ఆత్మ’ అనే చిత్రంలో నటించిన గీతిక తనను సుభాష్ లైంగికంగా వేధించారని పేర్కొంటూ ఆయన భార్య డింపుల్‌ని, ఆయన్ని ఓ స్టూడియోకు పిలిపించింది. సుభాష్ గురించి ఆయన భార్యకు వెల్లడించింది.

సుభాష్ తన భార్యకు జరిగిందంతా చెప్పి తన తప్పేమీ లేదని సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనంటూ గీతిక కన్నీరు పెట్టుకుంది. దీన్నంతా గీతిక ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. ఈ వీడియోలో అంతా రికార్డ్ అయింది కానీ ఆమె సుభాష్ చెంప పగలగొట్టింది మాత్రం వీడియోలో కనిపించలేదు. అయితే అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అమిర్ ఖాన్‌తో సుభాష్ ‘మొఘల్’ సినిమాను డైరెక్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు కానీ సుభాష్‌పై ఆరోపణలు రావడంతో అమిర్ ఆ సినిమా నుంచి తప్పుకున్నట్టు టాక్.

కైలాశ్‌ ఖేర్‌పై గాయని ఆరోపణలు

ప్రముఖ గాయకుడు కైలాశ్‌ ఖేర్‌ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తున్నారు బాలీవుడ్‌ గాయని సోనా మొహాపాత్ర. ‘మీటూ’ పేరిట నటీమణులు, గాయనీలు తాము ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి బయటపెడుతున్న తరుణంలో సోనా తన బాధను సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. ‘ఒక రోజు కాఫీ షాప్‌ వద్ద నేను కైలాశ్‌ ఖేర్‌ను కలిశాను. ఇద్దరం కలిసి కచేరీ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. దీని గురించి చర్చించడానికి కలుసుకున్నాం. ఆ సమయంలో నాపై చేతులు వేస్తూ ‘మీరు చాలా అందంగా ఉన్నారు’ అన్నాడు. నేను అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాను.’

‘ఆ తర్వాత కూడా కైలాశ్‌ నన్ను వదల్లేదు. ఢాకాలో ఫ్లైట్‌ దిగగానే నేను నా హోటల్‌ రూంకు వెళుతున్నాను. ఆ సమయంలో కైలాశ్‌ నాకు పలుమార్లు ఫోన్‌ చేశాడు. కానీ నేను లిఫ్ట్‌ చేయలేదు. అప్పుడు షో నిర్వాహకులకు ఫోన్‌ చేసి నా చేత మాట్లాడించమని అడిగేవాడు. ఇక చేసేదేంలేక అతనితో ఫోన్లో మాట్లాడాను. కచేరీ కార్యక్రమాన్ని వదిలేసి తన గదికి రావాలని చెప్పాడు. గతంలో కైలాశ్‌ నా స్టూడియోలో ఎన్నో పాటలు పాడాడు. కానీ అతనికి ఇలాంటి బుద్ధి ఉందని ముందే తెలిసుంటే నా పట్ల ఇలా జరిగి ఉండేది కాదు. ఇంత నీచమైన వ్యక్తి తన ట్విటర్‌ బయోలో తానో సింపుల్‌ వ్యక్తినని రాసుకున్నాడు.’ అని వెల్లడించారు.

అలోక్‌నాథ్‌ నరరూప రాక్షసుడు

‘సీరియల్‌లోనే కాదు బయట కూడా సంధ్య నా కూతురులాంటిదే’..అంటూనే అలోక్‌నాథ్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించేవారని అంటున్నారు బాలీవుడ్‌ నటి సంధ్య మృదుల్‌. అలోక్‌, సంధ్య తండ్రీ కూతుళ్ల పాత్రల్లో ఓ సీరియల్‌లో నటించారు. కానీ అతను సీరియల్‌లో కనిపించినంత మంచివాడు కాదని మృదుల్‌ తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో తనకు ఎదురైన అనుభవాలను ఓ పోస్ట్‌లో పేర్కొన్నారు.

‘నా కెరీర్‌ తొలినాళ్లలో ఓ టీవీ సిరీస్‌ చిత్రీకరణ నిమిత్తం కొడైకెనాల్‌ వెళ్లాను. ఆ సిరీస్‌లో రీమా లగూ మా అమ్మగా, అలోక్‌ నా తండ్రిగా నటించారు. నా నటన చూసి అలోక్‌ చాలా మెచ్చుకునేవారు. ‘దేవుడి బిడ్డ’ అనేవారు. నేను చాలా పొంగిపోయేదాన్ని. ఆయన్ను అద్భుతమైన తండ్రి అనేదాన్ని. ఒకరోజు త్వరగా చిత్రీకరణ పూర్తిచేసుకుని అందరం కలిసి డిన్నర్‌ చేయడానికి వెళ్లాం. డిన్నర్‌ పూర్తయ్యాక అలోక్‌ బాగా తాగారు. నేను తన పక్కనే కూర్చోవాలని, నేను తనకే సొంతమని ఏవేవో వాగారు. అది నాకు ఇబ్బంది కలిగించింది. నా పట్ల ఏం జరుగుతోందో గమనించిన నా సహ నటి ఒకరు నన్ను తీసుకుని బయటకు వచ్చేశారు. కాసేపటి తర్వాత నా హోటల్‌ గదికి వెళ్లిపోయాను. ఆ సమయంలో ఎవరో నా గది తలుపు కొట్టారు. ఎవరా? అని తీసి చూస్తే అలోక్‌ కన్పించారు. బాగా తాగున్నారు. తలుపు మూసేద్దామని ప్రయత్నిస్తుంటే బలవంతంగా లోపలికి తోసుకుని వచ్చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సినిమాటోగ్రాఫర్‌ నా వద్దకు వచ్చి సాయం చేశారు. దాంతో అలోక్‌ నన్ను నోటికొచ్చినట్లు మాట్లాడారు. మరుసటి రోజు చిత్రీకరణలో నేను అలోక్‌ ఒడిలో కూర్చుని ఆయన్ను పట్టుకుని ఏడవాల్సిన సన్నివేశం ఉంది. ఎలాగోలా ఆ సన్నివేశం పూర్తిచేశాను. చిత్రీకరణ జరిగినన్ని రోజులూ అలోక్‌ రాత్రి వేళల్లో తాగి నా గది వద్దకు వచ్చేవారు. ఈ ఘటనల కారణంగా నాకు జ్వరం వచ్చేసింది. దాంతో షూటింగ్‌కు వెళ్లలేక నా గదిలోనే నిద్రపోయాను. అప్పుడు కూడా అలోక్‌ వదల్లేదు. విపరీతంగా ఫోన్‌ కాల్స్‌ చేసేవాడు. ఆ తర్వాత ఒకరోజు అలోక్‌ నా గది వద్దకు వచ్చారు. ‘ఇక నేను ఇవి భరించలేను. నన్ను వదిలేయండి’ అని ఆయన కాళ్లు పట్టుకుని ఏడ్చాను. అప్పుడు అలోక్‌ నా పక్కన కూర్చుని ‘నాకు తాగుడు అలవాటుంది. ఈ అలవాటు కారణంగానే నా కుటుంబాన్ని దూరం చేసుకున్నాను. నేను థెరపిస్ట్‌ వద్దకు వెళ్లి ట్రీట్‌మెంట్‌ తీసుకుంటాను. తాగుడు మానేస్తాను. నువ్వు ఇప్పటికీ నా కూతురు లాంటిదానివే’ అన్నారు. నేను ఆయన మాటలు నమ్మాను. నమ్మాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయనతో కలిసి మిగతా చిత్రీకరణను ఎలా పూర్తిచేశానో నాకే తెలీదు. ఆ సమయంలో నాకు మద్దతుగా నిలిచిన నా సహనటులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని వెల్లడించారు సంధ్య.

(Visited 1 times, 1 visits today)