Home / Entertainment / ఖైదీ నెంబర్ 150 టికెట్ కోసం గొంతు కోసుకున్న మెగాస్టార్ అభిమాని..!

ఖైదీ నెంబర్ 150 టికెట్ కోసం గొంతు కోసుకున్న మెగాస్టార్ అభిమాని..!

Author:

దాదాపు 10 సంవత్సరాల తరువాత మెగాస్టార్ చిరంజీవి సినిమా విడుదల అవ్వడంతో థియేటర్ల వద్ద అభిమానుల హంగామా ఒక రేంజ్ లో ఉంది, థియేటర్ల వద్ద పెద్ద పెద్ద పోస్టర్లతో, దండలతో, టపాకాయలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు చాలా మంది, కానీ విశాఖపట్నంలో ఒక అభిమాని చేసిన పని అందరికి షాక్ ఇచ్చింది.

mega-fan-cuts-his-throat-for-not-getting-khaidi-no-150-movie-ticket

వైజాగ్ లో రామ థియేటర్ వద్దకి ఖైదీ నెంబర్ 150 సినిమా చూడాలని ఒక అభిమాని ఫుల్లుగా మద్యం తాగి వచ్చాడు, అయితే ఆ అభిమానికి సినిమా టికెట్ దొరకలేదు, దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు అభిమాని బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు హాస్పిటల్ కి తీసుకవెళ్తుంటే వాళ్ళని ప్రతిఘటించాడు, సినిమా టికెట్ ఇస్తేనే ఆసుపత్రికి వెళతానని లేకుంటే ఇక్కడే చచ్చిపోతానని అనటంతో పోలీసులు వచ్చి అతనిని హాస్పిటల్ కి తీసుకెళ్లారు.

సినిమా ఒక షో కాకపోతే ఇంకో షో చూడొచ్చు, కానీ ప్రాణం పోతే మళ్లీ రాదు అని ఇలాంటి పిచ్చి అభిమానులు ఇప్పటికి అర్ధం చేసుకుంటారో ఏమో…!

(Visited 567 times, 1 visits today)