Home / Entertainment / మెగా ప్లాన్ ?

మెగా ప్లాన్ ?

Author:

మెగా స్టార్ చిరంజీవి బర్తడే దగ్గరపడుతున్నా కొద్ది కొత్త కొత్త వార్తలూ గాసిప్పులూ వ్యాపిస్తున్నాయి. ఒకవైపు చిరంజీవి 150వ సినిమా సంగతులు మరోవైపు చిరు తీసుకోబోయే రాజకీయ ఎత్తుగడలు.. ఫిలిం నగర్ తో పాటూ అన్ని పార్టీ ఆఫీసుల్లో ఇవే చర్చలు.150 వ సినిమా పూరి జగన్నాథ్ దిరెచ్తిఒన్ అనేది దాదాపు కన్ఫం అయినప్పటికీ కాదు వి వి వినాయక్ కథ కూడా చెప్పేసాడు వినాయకే 150 వ సినిమా డైరెక్టర్ అని రకరకాల గాసిప్స్ వస్తున్నాయి.మరో వయిపు చిరు పవన్ తో రెగ్యులర్ గా భేటీ అవుతున్నాడని, ఆంద్రలో చంద్రబాబు వైపల్యాలన్నింటినీ క్యాష్ చేస్కోవాలంటే పవన్ జనసేన లో చిరు ఎంట్రీ ఇస్తారనీ, దానికి బీజేపీ ఫుల్ సపోర్ట్ ఇస్తుందనీ పొలిటికల్ గాసిప్స్ రాష్ట్రవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ న్యూస్ ని నిజం చేసేలాగే అల్లు అర్జున్, చరణ్ చిరు బర్త్డే రోజు కొన్ని స్టెప్స్ తీసుకోబోతున్నారానీ తెలుస్తోంది. మొత్తం మెగా ఫామిలీ అంతా ఒక వేదిక మీదకు రాబోతోంది. అసలు ప్రజల కోసమే చిరు, పవన్ లు ఒక్క తల్లి బిడ్డలయినా పొలిటికల్ గా సెపెరట్ అయ్యారని..ఇప్పుడు మళ్ళీ స్టేట్ కోసమే, ప్రజల కోసమే మళ్ళీ ఒక్కటి కాబోతున్నారు అనేది పొలిటికల్ సెంటర్స్ లో విపరీతంగా చర్చకోస్తుంది.ఈ న్యూస్ నిజం అనే దిశలో కొన్ని హింట్స్ కూడా ఫిలిం నగర్లో  కనపడుతున్నాయి. ఇదే నిజం అయితే మెగా ఫాన్స్ కి ఒక పండగే..మెగా బ్రదర్స్ ఒక్కటయ్యి చంద్రబాబు కి నిద్ర లేకుండా చేయబోతున్నారని ఇప్పటికే సోషల్ నెట్వర్క్ లో న్యూస్ హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ మెగా  స్టొరీ కి స్క్రీన్ ప్లే అంత బీజేపి రచిస్తోందని డిల్లి నుంచి అందుతున్న న్యూస్. చూడాలి మరి చిరు బర్త్ డే ఎన్ని సంచనాలకి కేంద్రం అవబోతుందో ?    ఏది ఏమయినా చిరు బర్త్ డే  రోజు ఈ వార్తలన్నింటికి ఒక క్లారిటీ వస్తుంది..

(Visited 79 times, 1 visits today)