Home / Inspiring Stories / మంచి ప్రపంచం కోసం ధ్యానం చేస్తున్న 10 లక్షల విద్యార్థులు

మంచి ప్రపంచం కోసం ధ్యానం చేస్తున్న 10 లక్షల విద్యార్థులు

Author:

rsz_vstarchangetheworld

మార్పు అనేది మన నుండే మొదలవ్వాలి అనేది పెద్దలు చెప్పిన నీతి. ఇప్పుడే దానినే ఆచరిస్తున్నారు థాయిలాండ్ లోని పాఠశాల విద్యార్థులు, రోజు రోజు కి ప్రపంచంలో పెరిగిపోతున్న మానవ సమస్యలని తగ్గించడానికి వీ-స్టార్ అనే సంస్థ ప్రతి సంవత్సరం 5000 పాఠశాలలలోని విద్యార్థులకి మూడు నెలలు ఆనందంగా ఎలా బ్రతకాలో శిక్షణ ఇస్తారట. ఈ శిక్షణలో రోజు వారి పనులు అనగా చిన్న చిన్న వంటలు చేయడం, ఇల్లు సర్డడం, వ్యవసాయం, వ్యాయామం, ఆటలు, పాటలు ఇంకా జీవితానికి ఆవరసరమైన చాలా పనులు నేర్పిస్తారట.

rsz_vstar2

ఆ మూడు నెలలు శిక్షణ తీసుకున్న విద్యార్థులను చివరి రోజున బ్యాంకాక్ లోని ప్ర-దమ్మకాయ అనే పేరు గల బౌద్దగుడికి తీసుకువచ్చి ధ్యానం చేయడం నేర్పిస్తారట. ఈ మూడు నెలల శిక్షణ మరియు ధ్యానం తమకు నిజంగా ఉపయోగపడుతున్నాయి అని చాలా మంది విద్యార్థులు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు అన్ని దేశాలలో నిర్వహిస్తే మంచి ప్రపంచం వీలు అవుతుంది అని ఈ కార్యక్రమం నిర్వహిస్తున సంస్థ తెలిపింది. నేటి బాలలే రేపటి పౌరులు అన్న మాట నిజం ఐతే ఇలాంటి శిక్షణ తీసుకున్న ఇన్ని లక్షల మంది బాలలు రేపటి మంచి ప్రపంచం కోసం తోడ్పడుతారని ఆశిద్దాం.

(Visited 95 times, 1 visits today)