Home / Latest Alajadi / వాహనాల నంబర్ ప్లేట్లపై ప్రెస్, పోలీస్ స్టిక్కర్ కనిపిస్తే జైలుకే…!

వాహనాల నంబర్ ప్లేట్లపై ప్రెస్, పోలీస్ స్టిక్కర్ కనిపిస్తే జైలుకే…!

Author:

ఈ మధ్య ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలని చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తుండటంతో చాలా మంది వారి నుండి తప్పించుకోవడానికి కొత్త పంథాని ఎంచుకున్నారు, బండి పైన ప్రెస్, పోలీస్, ఆర్మీ, జడ్జి అనే స్టిక్కర్లు ఉంటే ట్రాఫిక్ పోలీసులు అంతగా పట్టించుకోరు అని తెలుసుకొని ఆ స్టిక్కర్లని వారి వాహనాలపై అతికుంచుకుంటున్నారు, ఆ స్టిక్కర్లని ఉపయోగించి నంబర్ ప్లేట్ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తుండడంపై దృష్టి సారించిన ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపించాలని నిర్ణయించారు.

police-press-stikker

ఈ స్టిక్కర్లని బండిపై అతికించి పార్కింగ్ ఫీజులని ఎగ్గొట్టడం, ట్రాఫిక్ పోలీసులని బెదిరించడం, ట్రాఫిక్ చలానాలని కట్టకుండా ఉండటం చేస్తుండటంతో అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు రెడీ అయ్యారు, పోలీసులు, ప్రెస్, జడ్జీలు, ఆర్మీ ఆఫీసర్స్ కానివారు కూడా ఈ స్టిక్కర్లని బండి వేయించుకొని పోలీసుల నుండి తప్పించుకుంటున్నారని,అటువంటి వారు పట్టుబడితే దుర్వినియోగం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. 2001లో పార్లమెంటుపై దాడి జరిగిన సమయంలో ఉగ్రవాదులు తమ వాహనాలకు ‘ప్రెస్’ స్టిక్కర్లు అతికించుకున్న విషయం తెలిసిందే. దీంతో స్టిక్కర్ల ద్వారా భద్రతకు కూడా ముప్పు పొంచి ఉందని భావిస్తున్న అధికారులు ఈ విషయంపై సీరియస్గా దృష్టి సారించారు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్డ్ నంబర్ ప్లేటుపై ఏదైనా రాయడం, స్టిక్కర్లు అతికించడం నేరం.

(Visited 5,530 times, 1 visits today)