Home / General / డ్రైవింగ్ చేస్తూ మాట్లాడితే సెల్ ఫోన్ సీజ్

డ్రైవింగ్ చేస్తూ మాట్లాడితే సెల్ ఫోన్ సీజ్

Author:

రోడ్ సేఫ్టీ, ఫోన్ డ్రైవింగ్ వల్ల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యాక్సిడెంట్లు పెరిగాయి. వీటిపై అక్కడి హైకోర్టులోనూ పిటీషన్స్ వేశారు. దీనిని విచారించిన కోర్టు.. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వారికి రూ.5వేలు జరిమానా విధించాలని ఆదేశించింది. అయినా పెద్దగా మార్పు రాలేదు. దీనిపై సీరియస్ అయిన కోర్టు.. వాహనం కాకుండా సెల్ ఫోన్లనే సీజ్ చేయమని ఆదేశించింది. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి సంబంధించిన మొబైల్ ఫోన్లను సీజ్ చేయాలని ఆర్డర్స్ వేసింది. 24 గంటలు స్విచ్ఛాప్ చేయాలని కోరింది. అందుకు రసీదు ఇవ్వాలని చెప్పింది. మొబైల్ ఫోనే జీవితంగా బతికేస్తున్నారని.. అన్ని కూడా ఫోన్ల ద్వారా చేస్తున్నారని.. అలాంటి ఫోన్ ను సీజ్ చేస్తే తిక్క కుదురుతుందని వ్యాఖ్యానించింది. 24 గంటల తర్వాత తిరిగి ఇవ్వాలని పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చింది.

Mobile phone driving laws

రెండో సారి కూడా దొరికితే.. మొబైల్ ఫోన్ తోపాటు వాహనాన్ని కూడా సీజ్ చేయాలని.. అప్పుడే మార్పు వస్తుందని అభిప్రాయపడింది. రోడ్ సేఫ్టీపై అవగాహన కోసం పలు కార్యక్రమాలు చేపట్టాలని కూడా సూచించింది కోర్టు. మొబైల్ ఫోన్లను సీజ్ చేయటం అనేది దేశంలో ఫస్ట్ ఇదే అంటున్నారు నెటిజన్లు. అన్నం లేకపోయినా బతికేస్తారు.. ఫోన్ లేకపోతే మాత్రం బతకలేని రోజులు.. అలాంటి స్మార్ట్ ఫోన్ ఒక్క రోజు లేకపోతే ఎలా అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు అయితే ఒక రోజు కాదు.. నాలుగు రోజులు సీజ్ చేస్తే అప్పుడు తెలిసి వస్తుందని అంటున్నారు. మొత్తానికి మొబైల్ ఫోన్లు సీజ్ చేయటం అనేది మాత్రం ఇంట్రస్టింగ్ గా ఉందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

(Visited 1 times, 1 visits today)