Home / Inspiring Stories / మృతికి ముందే మాజీ ప్రధానికి సంతాప సభ.

మృతికి ముందే మాజీ ప్రధానికి సంతాప సభ.

Author:

మొన్నటికి మొన్న క్రితం జూన్ లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతి చెందటానికి ముందే ఆయనకు నివాళులు అర్పించిన ఝార్ఖండ్ మంత్రి నీరా యాదవ్ అభాసు పాలైన  ఉదంతం మరవక ముందే అలాంటిదే మరో సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఒడిషాలోని తీర బాలాసోర్ జిల్లా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్ పేయి మరణ వార్త ని తోటి ఉపాధ్యాయులకు తెలిపి పాఠశాల బంధ్ కి  ఆదేశాలు కూడా ఇచ్చేశాడు. గత శుక్రవారం ఉదయం ఔపాడా బ్లాక్ లో ఉన్న హైస్కూల్ విధ్యార్తులూ, ఉపాధ్యాయులు మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మరణించారనీ ఆయనకు నివాళులర్పించారు. ఇదంతా ఆ పాఠశాల ప్రధానొపాధ్యాయులు కమలాదాస్ వల్ల జరిగిన
పొరపాటు.

ఈ సంఘటన తెలిసిన స్థానికులు కొందరు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లటం తో వ్యవహారం సీరియస్ అయింది.  స్థానికుల కథనం ప్రకారం అదే రోజు దగ్గరలో ఉన్న మరో స్కూల్ లో జరిగే ట్రైనింగ్ కి వెళ్ళిన ప్రధనోపాధ్యాయుడు కమలా దాస్ ఉదయాన్నే “అటల్ బిహారీ వాజ్ పేయి మరణించారనే” వార్తని ఫోన్ కాల్ ద్వారా తెలిపారు. దానితో మిగిలిన ఉపాధ్యాయులు కూదా అసలా సంఘటన నిజమా కాదా తెలుసుకోకుండానే. స్కూలు పిల్లలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి వాజ్ పేయి కు సంతాప సభ ఏర్పాటు చేసి. ఆ రోజుకి సెలవు ప్రకటించేసారు. విషయం తెలియగానే ఆ ప్రధానోపాద్యాయుని సస్పెన్షన్ కు ఆదేశాలిచ్చిన జిల్లా కలెక్టర్. విచారణ కు ఆదేశించారు ఈ విషయం పై పూర్తి
వివరాలను తనకు వెంటనే తెలియ జేయాల్సిందిగా సర్వశిక్ష అభియాన్ అధికారులకి అదేశాలిచ్చారు. విచారణ పూర్తయిన వెంటనే ఆ ఉపాధ్యాయుని పై చర్య తీసుకుంటామని తెలిపారు.

(Visited 76 times, 1 visits today)