Home / Devotional / ఈరోజే ముక్కోటి ఏకాదశి..! ప్రతి ఒక్కరు ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం, అందరికి తెలియజేయండి.

ఈరోజే ముక్కోటి ఏకాదశి..! ప్రతి ఒక్కరు ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం, అందరికి తెలియజేయండి.

Author:

సూర్యుడు ఉత్తరాయాణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠం వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహా విష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు.

ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది.

ప్రతి సంవత్సరానికి 24 ఏకాదశలు ఉంటాయి .అందులో కెల్లా వైకుంఠ ఏకాదశి ఎంతో పవిత్రమైందని వేద శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఏకాదశి శ్రీ మహా విష్ణువునకు మిక్కిలి ప్రీతికరమైది. కనుకనే ఏకాదశిని హరి వాసరం అని అన్నారు పెద్దలు.24 ఏకాదశులలోను ప్రశస్థమైన దనుర్మాసంలో (మార్గశిర/పుష్యమాపాల్లో) వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ‘‘ వైకుంఠ ఏకాదశి’’ గా కీర్తిస్తున్నాయి. నమోక్ష ఏకాదశికి సంబంధించి ప్రాచుర్యంలో ఉన్న పురాణ కథ ఇది..శ్రీమాన్నా నారాయణకి సూర్యుడు కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను.కన్నులు వేరుగా ఉన్నా దృష్టి ఒక్కటే అయినట్లు, సూర్య చంద్రులు వేరు వేరుగా కనిపిస్తున్నా కాంతి తత్వం ఒక్కటే అని మహా తత్వాన్ని ఈ పండుగ సూచిస్తుంది.

వైకుంఠ ఏకాదశి సాదారణంగా మార్గశిర పుష్యమాసాల్లో వస్తుంది. రావణుని బాధలు తాళలేక దేవతలు.. బ్రహ్మను వెంట బెట్టకుని వైకుంఠానికి చేరారు.హరి వాసరమైన మార్గశిర శక్ల ఏకాదశినాడు శ్రీహరిని ప్రార్థించి, తమ బాధను విన్న వించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీమహా విష్ణువు బ్రహ్మాదులకు దర్శన మిచ్చి వారి కోరికను నెరవేర్చారు. దేవతల బాధా నివారణానికి ఈ ఏకాదశియే మార్గం చూపింది.

(Visited 1 times, 1 visits today)