Home / Inspiring Stories / MRP రేటు మార్చేసి ప్రజలను దోచుకుంటున్న సినిమా హాళ్ళు, మల్టీప్లెక్సులు.

MRP రేటు మార్చేసి ప్రజలను దోచుకుంటున్న సినిమా హాళ్ళు, మల్టీప్లెక్సులు.

Author:

ఒక లీటర్ మినరల్ వాటర్ బాటిల్ ధర ఎంత ఉంటుంది? మహా ఐతే ఒక 20 రూపాయలు ఉంటుంది కాని సినిమా హాళ్ళు, మల్టీప్లెక్సులలో మాత్రం 50 రూపాయలు ఉంటుంది, అదేంటి బయట 20 రూపాయలే కదా అంటే కాదండి కావాలంటే చెక్ చేసుకోండి అని ఆ బాటిల్ పై చూస్తే నిజంగానే MRP 50 రూపాయలు ఉంటుంది, ఆశ్చర్యపోవడం అటుంచి చచ్చినట్లు 50 పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కోవాలి. నమ్మకం కుదరడంలేదా? ఐతే క్రిందా ఉన్న ఫోటో చూడండి.

new mrp for multiplexes

సినిమా హాళ్ళు, మల్టీప్లెక్సులలో తినుభండారాలను ఎక్కువ రేట్లకు అమ్మడాన్ని సుప్రీం కోర్టు ఎప్పుడో నిషేదించింది. అన్ని వస్తువులు MRP రేట్లకే అమ్మాలని అదేశాలు ఇవ్వడంతో ఇక చేసేది ఏమి లేక సినిమా హాళ్ళు, మల్టీప్లెక్సుల నిర్వాహకులు కొత్త రకం మోసానికి తెర తీసారు. తన సినిమా హాళ్ళలో అమ్మడం కోసం ఉంచే అన్ని వస్తువులపై ముందుగానే ఆ వస్తువుల తయారీదారుల నుండి సాదారణ ధరకే కొని ఎక్కువ MRP రేటు ప్రింట్ చేయించుకుంటున్నారు. అసలు ధరపై కొంత శాతం ఎక్కువ ప్రింట్ చేసినా పర్వాలేదు కాని అసలు ధరపై ఏకంగా 150% ఎక్కువ ప్రింట్ చేయించి ఆ ఎక్కువ ధరకు వస్తువులు అమ్మి ప్రజలను దోచుకుంటున్నారు. ఉదాహరణకు కిన్లీ ఒక లీటర్ మినరల్ వాటర్ బాటిల్ ధర మార్కెట్ లో 20 రూపాయలు ఉంది, కాని అదే కిన్లీ వాటర్ బాటిల్ మీదా అది తయారు చేసే సమయంలోనే ధర 50 రూపాయలుగా ప్రింట్ చేయించారు. ఆ బాటిళ్ళను సినిమా హాళ్ళలో అమ్ముతున్నారు ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే మేము MRP ధరకే అమ్ముతున్నామని కావాలంటే చెక్ చేసుకోండి అని దబాయిస్తున్నారు. ఆ బాటిల్ మీదా MRP నిజంగానే 50 రూపాయలు ఉండటంతో చేసేదేమి లేక ప్రజలు ఎక్కువ రేటుకు వస్తువులు కొనుక్కుంటున్నారు. ఈ సంఘటన మొన్న హైదరాబాద్ లో జరిగింది.

నిబంధనల ప్రకారం సినిమా థియేటర్ లలో సాధారణ MRP రేటుకే అమ్మాలి, కానీ థియేటర్ యాజమాన్యాలు మాత్రం నిభంధనలని అతిక్రమించి ప్రజల నుండి భారీగా డబ్బుని దోచుకుంటున్నారు, మీకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే బిల్ తీసుకోని వినియోదారుల ఫోరమ్ లో ఫిర్యాదు చేయండి.

(Visited 1,363 times, 1 visits today)