Home / Inspiring Stories / మానవత్వానికి మతం అడ్డురాలేదు, హిందు యువకుడి శవానికి అంత్యక్రియలు నిర్వహించిన ముస్లిం సోదరులు.

మానవత్వానికి మతం అడ్డురాలేదు, హిందు యువకుడి శవానికి అంత్యక్రియలు నిర్వహించిన ముస్లిం సోదరులు.

Author:

పలు పత్రికలు, మీడియా వారి కధనాల ప్రకారం పశ్చిమ బెంగాల్ లోని మాల్డ ప్రాంతం మత పరమైన అల్లర్లకు పెట్టింది పేరు. కాని మన దేశం లో మత పరమైన గొడవలకు కారణం మాత్రం ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే రాజకీయ నాయకులే. సామాన్య ప్రజలు ఇతరులకు కష్టం వస్తే మతాలకు సంబంధం లేకుండా ఒకరినొకరు ఏలా ఆదుకుంటారనే తెలిపే సంఘటణ మాల్డలోని షేక్ పురా లో జరిగింది. 35 ఏళ్ల బిశ్వజిత్ రాజక్ అనే యువకుడు ఏప్రిల్ 24 న కాలేయం క్యాన్సర్ వ్యాధి ముదరడంతో మరణించాడు. భార్య, ముగ్గురు కూతుర్లు, ముసలి తండ్రితో కలిసి నివసించే బిశ్వజిత్ ఒక్కసారిగా చనిపోవడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కు లేక రోడ్డున పడింది. 6000 మంది ఉండే ఆ ఊరిలో రెండే హిందు కుటుంబాలు నివసిస్తున్నాయి. బిశ్వజిత్ అంత్యక్రియలు చేయలన్నా నలుగురు లేరని బాధపడుతున్న ఆ కుటుంబానికి బాసటగా నిలిచారు ఇరుగుపొరుగు ముస్లిములు.

muslims helped cremating died hindu man

బిశ్వజిత్ దహన సంస్కారాలు నిర్వహించాలుకున్న ముస్లిములు అందుకోసం అన్ని ఎర్పాట్లు చేసారు, అందరూ కలిసి వెదురు కర్రలతో పాడే కట్టి స్వయంగా హిందు సాంప్రాదాయం ప్రకారం మూడు కిలోమీటర్ల పాటు పాడేను మోసి స్మశానానికి చేర్చారు. శవాన్ని దహనం చేసిన తరువాత దగ్గరలోని నదిలో స్నానం ఆచరించి తదుపరి కార్యక్రమాలు పూర్తి చేసారు. హిందువులు తమకు సోదరులని వారు కష్టాల్లో ఉన్నప్పుడు తాము ఎల్లప్పుడు ఆదుకునేందుకు ముందంటామని బిశ్వజిత్ అంత్యక్రియల్లో పాల్గొన్న వందల మంది ముస్లిములు తెలిపారు. కులాలు, మతాలుగా విడిపోయిన ప్రజలు ముందుగా మనం మనుషులం అని గుర్తెరిగిన రోజు కుల మతాల పేరుతో జరిగే గొడవలు మన దేశం లో ఎప్పటికి జరుగవు, దయచేసి ఇది గుర్తించండి.

(Visited 308 times, 1 visits today)