Home / Entertainment / నాది నన్ను చెప్పుకోనివ్వండి అంటున్న అతిలోక సుందరి

నాది నన్ను చెప్పుకోనివ్వండి అంటున్న అతిలోక సుందరి

Author:

నేను చెప్పకుండా ఇంకెవరో ఎలా చెప్తారు? నా భాష నన్ను మాట్లాడనివ్వండి అంటుంది నిన్నటి తరం అతిలోకసుందరి శ్రీదేవి . తను నటిగా తన కెరీర్ ని దక్షిణాది లోనే మొదలు పెట్టిన ఈ ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి దాదాపు తెలుగు తమిళ సినీ పరిశ్రమల్లో అందరు అగ్ర హీరోల సరసనా నటించింది. ఎన్నో హిట్ చిత్రాలలో శ్రీదేవి తన అంద చందాలతో, నటన తో అప్పటి యువతరాన్ని ఉర్రూతలూగించింది. వేటగాడు లో సీనియర్ ఎంటీఆర్ పక్కన స్టెప్పులేసిన ఈ పదహారేళ్ళ వయసు హీరోయిన్ ‘ఆకు చాటు పిందె తడిసే’ పాట్లో ఒలకబోసిన అందలని ఇప్పటికీ మర్చిపోలేరు ప్రేక్షకులు. కేవలం అందాల మీదనే ఆఢారపడకుండా “జగదేక వీరుదూ అతిలోక సుందరిలో” చిరంజీవి పక్కన అంతే స్టైల్ లో నటించి రెండో తరం ప్రేక్షకులకూ దగ్గరయింది. నాగార్జునా శ్రీదేవి ల కాంబినేషన్లో వచ్చిన ఆఖరిపోరాటం నాగార్జున ఖాతాలో మొదటి విజయాన్ని నమోదు చేయగా శ్రీదేవి లోని నటినీ మరోసారి చూపించింది.

వసంతకోకిల, పదహారేళ్ల వయసు చిత్రాలలో ఆమే చేసిన పాత్రలు కేవల శ్రీదేవి వల్లనే అంత గుర్తింపు తెచ్చుకున్నాయంటేనే శ్రీదేవి స్టామినా ఏంటో తెలుస్తుంది. ఆ తర్వత బాలీవుడ్ లో అడుగు పేట్టిన శ్రీదేవి అక్కడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గానే కొనసాగింది. ఇప్పటి తన మరిది అనిల్ కపూర్ తో చేసిన సినిమాలు అన్నీ దాదాపుగా సూపర్ హిట్లే. వచ్చే జన్మంతూ ఉంటే తనకు శ్రీదేవినే  పెళ్ళిచేసుకోవలనుందని సాక్షాత్తూ దర్శకుడు రాం గోపాల్ వర్మతో అనిపించుకున్న ఈ అందాల సుందరి. బోనీ కపూర్ తో పెళ్ళి తర్వాత నెమ్మదిగా సినిమాలకు దూరమైంది. ఐనా అభిమానుల మనసుల్లో ముద్ర వేసుకున్న ఈ ఇంద్రజ మళ్ళీ “మాలినీ అయ్యర్” అంటూ బుల్లితెర మీదా కొన్నళ్ళు సందడి చేసింది. తన రెండో ఇన్నింగ్స్ ని ఏకంగా హాలీవుడ్ స్థాయిలో “ఇంగ్లిష్-వింగ్లిష్’ తో రీ ఎంట్రీ ఇచ్చి క్రమంగా మళ్ళీ నటనకు నేను సిద్దమే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

ఇప్పుడు తాజా సమాచరం ఏంటంటే తమిళ క్రేజీ హేరో విజయ్ హీరోగా నటించిన “పులి” సినిమాలో “మహారాణి” గా కనిపించిన ఈ లేత అందాల పాత సుందరి. పులి సినిమా తెలుగు వెర్షన్ లో తన పాత్ర కి తానే డబ్బింగ్ చెప్పుకుంటనని చెప్పిందట. ‘తెలుగు నా మాతృభాష. అక్కడి ప్రేక్షకులకి వేరే గొంతుతో కనిపించటం నాకు ఇష్టం లేదు” అందట. తన గొంతు వినిపిస్తేనె ఆ పాత్రకు న్యాయం జరుగుతుందనీ” చెప్పి దర్షకున్ని ఒప్పించిందట. ఇన్నేళ్ల తర్వాత తమ అభిమాన నటి ని వేరే గొంతుతో వినటం తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఏం బావుంటుంది చెప్పండి..! ఇప్పటికె తమిళ నాత భారీ అంచనాలతో ఉన్న ఈ “పులీ” తెలుగులో కూడా తెరుగులేని ప్లస్ పాయింట్ తో వస్తోంది.సో శ్రీదేవి నటనని ఆస్వాదించటానికి
రెడీ ఐపోండిక..

(Visited 101 times, 1 visits today)