Home / Latest Alajadi / నగరం రివ్యూ & రేటింగ్

నగరం రివ్యూ & రేటింగ్

నగరం రివ్యూ

Alajadi Rating

3.5/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: సందీప్ కిషన్, రెజీనా, శ్రీ, మధుసూదన్, చార్లె..తదితరులు

Directed by: లోకేష్ కనగరాజ్

Produced by: అశ్విని కుమార్ సహదేవ్

Banner: ఏకేఎస్ ఎంటెర్టైనమెంట్స్, పొటెన్షినిల్ స్టూడియోస్

Music Composed by: జావేద్ రియాజ్

నగరం అనే పేరు మీద సినిమా తీస్తున్నారని ట్రైలర్ చేసేవరకు చాలామందికి తెలియదు, ట్రైలర్ విడుదల అయిన తరువాత సినిమాపై ఒక్కసారిగా సినీ అభిమానులంతా దృష్టి పెట్టారు, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి,వరుస ప్లాప్ సినిమాల తరువాత సందీప్ కిషన్ కసితో చేసిన సినిమా ఇది, ఈరోజు విడుదల అయిన నగరం సినిమా ఎలా ఉందొ తెలుసుకోండి….!

కథ:

అదో మహా నగరం, ఎవరి పని వాళ్లదే, పక్కనోళ్ళ గురుంచి పట్టించుకునేంత సమయం ఎవ్వరికి ఉండదు, ఈ మహా నగరానికి ఉద్యోగం చేయడానికి వస్తాడు ఒక కుర్రాడు, నగరంలోనే ఉంటూ ఒక అమ్మాయి (రెజీనా) కోసం తిరుగుతాడు మరో కుర్రాడు (సందీప్), తన కొడుకు ఆపరేషన్ కోసం పల్లె నుండి పట్నం వచ్చి ఇక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు మరొకరు, మాఫియా డాన్ అవ్వాలని కలలు కనే వ్యక్తి మరొకరు, వీళ్ళందరికీ సంబంధం ఏంటి..? వీళ్లందరి జీవితం ఒక్కరోజులో ఎలా మలుపు తిరిగింది..? చివరికి ఏమి జరిగింది..? అనేది మిగిలిన కథ.

అలజడి విశ్లేషణ:

సినిమా అంటే హీరో, హీరోయిన్ ఓ నాలుగు పాటలు, మూడు ఫైట్లు , ఒక ఐటెం సాంగ్ మాత్రమే అని చాలా తెలుగు సినిమాలు నిరూపించాయి, కానీ సినిమా అంటే మనుషుల జీవితాలలో ఎదురయ్యే సమస్యల నుండి కూడా సినిమా అద్భుతంగా తీయొచ్చని ‘నగరం’ సినిమా నిరూపించింది, మొదటి సీన్ నుండి చివరి సీన్ వరకు ఎక్కడ కూడా ప్రేక్షకులకి బోర్ కొట్టకుండా కథలో ప్రేక్షకుడు లీనమైయ్యేలా సినిమాని తెరకెక్కించారు, ఇలాంటి కథల్ని తెరకెక్కించాలంటే, ఒప్పించాలంటే.. పకడ్బందీ స్క్రిప్టు అవసరం. దాన్ని చక్కగా రాసుకొన్నాడు దర్శకుడు. దాన్ని తెరపై చూపించడం ఇంకా కష్టం. అయినా సరే.. ఆ కష్టాన్నీ నేర్పుగా దాటే ప్రయత్నం చేశాడు.

కథ, స్క్రీన్ ప్లే , చిన్న చిన్న డైలాగ్స్ అన్ని ఈ సినిమాకి పక్కాగా కుదిరాయి, ఈ నాలుగు కథల్ని ఓచోట కలపడం, మలుపులు, థ్రిల్‌ ఇవన్నీ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి, సినిమా మొత్తం చాలా సహజంగా ఉంటుంది, పెద్ద పెద్ద సెట్లు, లొకేషన్లు ఏవి కనపడవు, మాములు మధ్యతరగతి వ్యక్తుల జీవితం కనపడుతుంది, సినిమా మొత్తం సీరియస్ మోడ్ లోనే ఉన్న ప్రేక్షకులు సినిమాకి కనెక్ట్ అయిపోతారు, ఇలాంటి సినిమాలు అరుదుగానే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా చూడండి.

సాంకేతికవర్గం పనితీరు:

ఈ సినిమాలో అందరి కంటే ఎక్కువ చెప్పుకోవాల్సింది డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురుంచే, నాలుగు కోణాల నుండి నాలుగు కథలని రాసుకొని, వాటన్నింటికి ఊచేతో కలిపి ఇంత అద్భుతంగా సినిమా చేయడం అంటే మాములు విషయం కాదు, స్టోరీ , స్క్రీన్ ప్లే ని పక్కాగా రాసుకొని సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించారు, కెమెరా వర్క్ కూడా సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్, మాములు లొకేషన్లలో కూడా చాలా మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు, బ్యాక్ గ్రౌండ్ సినిమాని నిలబెట్టింది, మంచి సినిమాని అన్ని మంచే జరుగుతాయి అనడానికి ఈ సినిమా మరో ఉదాహరణ..!

ప్లస్ పాయింట్స్ :

  • కథ
  • స్క్రీన్ ప్లే
  • సందీప్ కిషన్, శ్రీ, చార్లె ల నటన
  • మ్యూజిక్
  • ఎడిటింగ్

మైనస్ పాయింట్స్ :

  • అక్కడక్కడా స్లో అవ్వడం

పంచ్ లైన్ : నగరం సినిమా చూడకపోతే ఒక మంచి సినిమా మిస్ అయ్యినట్టే…!

(Visited 1,344 times, 1 visits today)