Home / Entertainment / నాగార్జున తో రాజమౌలి ?

నాగార్జున తో రాజమౌలి ?

Author:

అన్నీ మరచిపోయి, ఒకటే గమ్యం, ఒకటే గమనం, ఆశ,శ్వాసగా,ఢ్యాస ఒక్కటి చెసి జక్కన్న రాజమౌళి చెక్కిన చిత్ర శిల్పం బాహుబలి. అంతగా శ్రమించాడు కాబట్టే ప్రస్తుతం దాదాపు 500 కోట్ల రూపాయల మార్క్ చేరుకున్న తొలి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది. ఈ సినిమాపై ఇప్పటికే పలువురు సినీప్రముఖులు బాహాటంగా ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పుడు ఆ జాబితాలో హీరో నాగార్జున కూడా చేరిపోయారు.బాహుబలి ఫెంటాస్టిక్, మార్వలెస్,సినిమా చుసి జెలసీగా ఫీలయ్యాను.అందులో పార్ట్ కాలేకపోయినందుకు,యాక్ట్ చేయలేకపోయినందుకు బాధపడ్డాను.నటించిన వాళ్లంతా లక్కీ ఫెలోస్ అంటూ నాగార్జున బాహుబలి సినిమాని, రాజమౌళిని, మొత్తం టీం ని ఆకాశానికి ఎత్తేసారు. ప్రముఖ రచయిత ఆనంద్ నీలకంఠన్ రాసిన  రైజ్ ఆఫ్ కలి పుస్తకాన్ని నాగార్జున, అమల దంపతులు హైదరాబాద్ లో ఆవిష్కరించారు.జనరల్ గా పురాణాల నేపథ్యంలో పుస్తకాలు రాసే నీలకంఠన్ ఆనంద్ పురాణ పాత్రలను మరో కోణంలో చూపించడం ఆయన ప్రత్యేకత. ఆయన రాసిన అసుర పుస్తకం మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి, ఇలాంటి పురాణ కథలను సినిమాలుగా తీయాలని నాగార్జున ఆకాంక్షించారు.ఈ సమయంలోనే ఆయన రాజమౌళిపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. నీలకంఠన్ రాసిన అసుర సినిమాను రాజమౌళి సినిమాగా తీయాలని కోరారు. ఒకవేళ రాజమౌళి ఆ పని చేస్తే,రావణాసురుడి పాత్రను తాను చేస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు.దుర్యోధనుడి కోణంలోనూ నాతో ఎవరైనా తీయొచ్చు..ఆం ఆల్వెస్ రెడీ అన్నారు. చూద్దం మరి రాజమౌళి ఏమంటాడో..  రాజమౌళి కాకపొఇనా ఇంకెవరానా నాగ్ తో ఇలాంటి సినిమా చెసేందుకు రేడీ అవుతారేమో…

(Visited 110 times, 1 visits today)