నాగార్జున తన సినిమాలు చేస్తూనే అఖిల్ సినిమాపై పూర్తి దృష్టి పెట్టాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అఖిల్ తొలి సినిమాని హిట్ చేయాలన్న కసి అటు వినాయక్‌లో కంటే నాగార్జున లోనే ఎక్కువగా కనిపిస్తోందట. అందుకే వినాయక్‌పై ఎక్ స్ట్రా ప్రెజర్ తీసుకొస్తున్నాడట.వీలు దొరికితే చాలు రషెష్ చూస్తూ, ఇంప్రూవ్‌మెంట్ పేరుతో రకరకాల మార్పులు చెబుతున్నాడట నాగార్జున . ఆల్రెడీ స్ర్కీన్ ప్లేని తన ఆలోచనలకు అనుగుణంగా మార్చేశాడట. ఇప్పుడు పాటల ప్లేస్‌మెంట్, టైటిల్ విషయంలోనూ తీవ్రంగా జోక్యం చేసుకొంటున్నాడని, నాగ్ అతి జోక్యంతో వినాయక్ కూడా కాస్త టాక్. నిజానికి నాగ్ వల్లే ఈ సినిమా టైటిల్ ఇప్పటి వరకూ ఫిక్స్ చేయలేకపోయామని వినాయక్ బాధపడుతున్నాడట. అయితే ఇవేవి పట్టించుకునే స్టేజ్ లో నాగ్ లేడు. ఎందుకంటే, నాగార్జున కారణాలు నాగ్ దగ్గర ఉన్నాయి. నాగ్ ఇప్పటి వరకూ సూపర్ హిట్ సినిమాలెన్నో తీసుండొచ్చు. కానీ,ఇప్పటి వరకూ తన సినిమా ఏదీ రూ.50 కోట్ల క్లబ్‌లో చేరలేదు.నాగచైతన్య సినిమాలకూ భారీ ఓపెనింగ్స్ వచ్చిన దాఖలాలు లేవు. చైతూఎంట్రీ సినిమాలో నాగ్ పెద్ద తప్పు చేశానని ఇప్పట్కీ ఫీల్ అవుతుంటాడు. ఆసినిమా డిజాస్టర్‌గా మారి, చైతూ కెరీర్ ప్రారంభంలోనే రాంగ్ స్టెప్ వేసేలా చేసింది. ఆ తప్పు అఖిల్ విషయంలో చేయకూడదని నాగ్ భావిస్తున్నాడట. అందుకే ఈ సినిమాపై అంత కేర్ తీసుకొంటున్నాడు. మరి నాగ్ అతి జాగ్రత్త సినిమాకి హెల్ప్ అవుతుందా, లేదంటే వినాయక్ క్రెయేటివిటీ మొత్తం దెబ్బతిని నెగిటీవ్ ఫలితాలొస్తాయా? అన్నది చూడాలి. ఎంత సుపర్ స్టార్లయినా కొడుకు సినిమా విషయానికొచ్చే సరికి మాములు తండ్రే కదా.. ఈ మాత్రం కంగారు, టెన్షన్, ప్రెషర్ కామనే..