Home / Entertainment / సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో…ఘాటుగా ఫైర్ అయిన నమ్రత! అసలేమైంది?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో…ఘాటుగా ఫైర్ అయిన నమ్రత! అసలేమైంది?

Author:

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ డెలివరీ బాయ్ వీడియో వైరల్ అవుతుంది. జుమాటో డెలివరీ బాయ్ చేసిన పనికి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ డెలివరీ చేసే క్రమంలో మార్గమధ్యమం లోనే అన్ని ఆహారపదార్థాల పార్సిల్స్ ని ఓపెన్ చేసి ఆరగించేస్తున్నాడు. కొంచెం కొంచెం తిని అనుమానం రాకుండా తిరిగి ప్యాక్ చేస్తున్నాడు. అక్కడున్న సిసి టివిలో ఈ వీడియో రికార్డ్ కావడంతో వైరల్ అయింది.

ఇక సోషల్ మీడియాలో అంతగా ఆక్టివ్ గా ఉండని మహేష్ బాబు సతీమణి నమ్రత ఈ వీడియోపై తన స్టైల్ లో ఫైర్ అయ్యారు. ” ఇంత పేరున్న ఫుడ్ డెలివెరీ సంస్థ పనితీరు చూస్తుంటే షాకింగ్ గా ఉంది. ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసే వాళ్లు కనీస శుభ్రతని ఆశిస్తారు. కానీ ఈ విధంగానా డెలివర్ చేసేది.? మీకు వర్క్ ఎథిక్స్ అనేవే లేవా.? ఇదంతా చూస్తుంటే ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది. నా పిల్లలను మాత్రం ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయనివ్వను. అందరికీ కూడా నా సజెషన్ ఇదే” అని సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు నమ్రత.

నమ్రత పెట్టిన పోస్ట్ కు నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రజలని చైతన్యపరిచే విషయం తెలియజేసారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. చివరికి ఆ సంస్థ ఆ డెలివరీ బాయ్ ని ఉద్యోగం నుండి తీసేసింది.

(Visited 1 times, 3 visits today)